Dr. Vidyalatha Atluri

Dr. Vidyalatha Atluri Dr. Vidyalatha Atluri
� Leading IVF Specialist in Hyderabad
� Expert in Fertility Treatments

31/07/2026

💪 కండలు పెంచుకోవడానికి అనాబాలిక్ స్టెరాయిడ్స్ వాడుతున్నారా? మీ సంతానోత్పత్తిపై ప్రభావం పడొచ్చు!

అనాబాలిక్ స్టెరాయిడ్స్ అనేవి టెస్టోస్టెరాన్‌కు కృత్రిమ రూపం. వీటిని వాడటం వల్ల మెదడు శరీరంలో తగినంత టెస్టోస్టెరాన్ ఉందని భావించి సహజ ఉత్పత్తిని తగ్గించవచ్చు. ఫలితంగా:

* వీర్యకణాల ఉత్పత్తి తగ్గవచ్చు
* వీర్యకణాల సంఖ్య తీవ్రంగా పడిపోవచ్చు
* వృషణాల పనితీరుపై ప్రభావం పడవచ్చు
* స్టెరాయిడ్స్ ఆపిన తర్వాత కోలుకోవడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు
* కొందరిలో సంతానోత్పత్తి సమస్యలు దీర్ఘకాలం ఉండొచ్చు

గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్న పురుషులు అనాబాలిక్ స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండి, సహజ పద్ధతుల్లో శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం మంచిది.

📞 సంప్రదించడానికి కాల్ చేయండి: 7995132701
📍 3వ అంతస్తు, పీఎన్‌పీ టవర్స్, మైస్కేప్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పలగూడ, హైదరాబాద్, తెలంగాణ- 500032
mitrafertility drvidyalatha hyderabad

30/07/2026

సంభోగం తర్వాత వీర్యం బయటకు రావడం సాధారణమేనా? దీనివల్ల గర్భం రాదా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.

వీర్యంలో వీర్యకణాలు 5% కంటే తక్కువగా ఉంటాయి. మిగతా భాగం పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలోని గ్రంథుల నుంచి వచ్చే ద్రవాలతో కూడి ఉంటుంది. వీర్యం యోనిలో విడుదలైన తర్వాత వీర్యకణాలు గమ్యస్థానం వైపు ప్రయాణిస్తాయి. ఆ తర్వాత బయటకు వచ్చే ద్రవం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ ప్రక్రియే. దీనివల్ల గర్భధారణ జరగకుండా పోతుందని భావించాల్సిన అవసరం లేదు.

📞 సంప్రదించడానికి కాల్ చేయండి: 7995132701
📍 3వ అంతస్తు, పీఎన్‌పీ టవర్స్, మైస్కేప్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పలగూడ, హైదరాబాద్, తెలంగాణ- 500032
mitrafertility drvidyalatha hyderabad

28/07/2026

ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత లక్షణాలు లేకపోతే టెన్షన్ పడుతున్నారా? 🤔

ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత చాలా మంది ప్రతి చిన్న లక్షణాన్ని గమనిస్తూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. లక్షణాలు లేకపోతే గర్భం రాలేదని కాదు, లక్షణాలు ఉంటే గర్భం వచ్చిందని కూడా కాదు.

రొమ్ముల్లో నొప్పి, నీరసం, కడుపులో తేలికపాటి నొప్పులు వంటి లక్షణాలు గర్భధారణ వల్ల రావచ్చు, అలాగే ప్రొజెస్టెరోన్ మందుల ప్రభావం వల్ల కూడా రావచ్చు. కాబట్టి లక్షణాలపై దృష్టి పెట్టకుండా, వైద్యులు సూచించిన మందులను సమయానికి తీసుకోండి, పోషకాహారం తీసుకోండి, తగినంత నిద్రపోండి, ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండండి. మీ ప్రయాణాన్ని నమ్మకంతో కొనసాగించండి.

📞 సంప్రదించడానికి కాల్ చేయండి: 7995132701
📍 3వ అంతస్తు, పీఎన్‌పీ టవర్స్, మైస్కేప్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పలగూడ, హైదరాబాద్, తెలంగాణ- 500032
drvidyalatha hyderabad

25/07/2026

Some breakthroughs change science. IVF changed possibilities.💛

This World IVF Day, we celebrate not only an extraordinary medical advancement, but every journey shaped by resilience, trust, science, and compassion. Behind every IVF success is a dream that refused to fade and hope that found a way.

Here’s to every breakthrough, every hopeful heart, and every family waiting for their miracle.

Happy World IVF Day

📞 Call us at 7995132701 to schedule your consultation today.
📍 3rd Floor, PNP Towers, My Space Road, Financial District, Puppalaguda, Hyderabad, Telangana 500032
mitrafertility drvidyalatha financialdistrict hyderabad

24/07/2026

సంతానం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరూ తమ బాధను బయటికి చెప్పుకోలేరు. ఆలస్యం అవుతుందనే ఆందోళనతో ఇప్పటికే ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండవచ్చు.

“మీకు పిల్లలు లేరు కదా… బాధ్యతలు ఏం ఉంటాయి?”, “ఎప్పుడైనా హాలిడేకి వెళ్లిపోవచ్చు” అంటూ సరదాగా చేసే మాటలు కూడా వారికి తెలియకుండానే బాధను, ఒత్తిడిని మరింత పెంచవచ్చు.

ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు. అందుకే పిల్లలు లేరనే విషయంపై జోక్స్ చేయకండి. మీకు చిన్న మాట కావచ్చు… వారికి అది లోతైన గాయం కావచ్చు.

📞 సంప్రదించడానికి కాల్ చేయండి: 7995132701
📍 3వ అంతస్తు, పీఎన్‌పీ టవర్స్, మైస్కేప్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పలగూడ, హైదరాబాద్, తెలంగాణ- 500032
drvidyalatha hyderabad

23/07/2026

సంతాన సమస్యల నిర్ధారణలో ఒకే ఒక్క పరీక్షను సూచించాల్సి వస్తే... 👇

👨 పురుషుల కోసం: వీర్య పరీక్ష (Semen Analysis) – వీర్యంలోని కణాల సంఖ్య, కదలిక, నాణ్యత గురించి ముఖ్యమైన సమాచారం అందిస్తుంది.

👩 మహిళల కోసం: పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కాన్ – అండాశయాల్లో ఉన్న ఫాలికల్స్ సంఖ్య (Antral Follicle Count) ద్వారా ఓవేరియన్ రిజర్వ్ అంచనా వేయడమే కాకుండా, గర్భాశయం, అండాశయాల ఆరోగ్యం, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలను కూడా గుర్తించవచ్చు.

సరైన పరీక్షలు... సరైన సమయంలో... మీ కలను నిజం చేసే మొదటి అడుగు.

📞 సంప్రదించడానికి కాల్ చేయండి: 7995132701
📍 3వ అంతస్తు, పీఎన్‌పీ టవర్స్, మైస్కేప్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పలగూడ, హైదరాబాద్, తెలంగాణ- 500032
mitrafertility drvidyalatha hyderabad

21/07/2026

సంతానలేమి ప్రయాణంలో ఒత్తిడి సహజమే. కానీ ఆ ఒత్తిడిని తగ్గించడానికి కృతజ్ఞత భావంతో చేసే ధ్యానం ఒక అద్భుతమైన మార్గం.

ప్రతి ఉదయం లేవగానే కళ్లుమూసుకుని మీ శరీరంలోని ప్రతి భాగానికి, మీ జీవితంలో ఉన్న తల్లిదండ్రులు, గురువులు, బంధుమిత్రులకు, మీ ఇల్లు, ఆహారం, నైపుణ్యాలు, అలాగే ప్రకృతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. కేవలం 10 నిమిషాలు, వరుసగా 21 రోజులు ఈ సాధన చేయండి. మీ మనసు ప్రశాంతంగా మారి, సానుకూల ఆలోచనలు పెరిగి, జీవితంపై కొత్త ఆశ కలుగుతుంది. చిన్న అలవాటు... గొప్ప మార్పుకు నాంది.

📞 సంప్రదించడానికి కాల్ చేయండి: 7995132701
📍 3వ అంతస్తు, పీఎన్‌పీ టవర్స్, మైస్కేప్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పలగూడ, హైదరాబాద్, తెలంగాణ- 500032
healthybodyhealthyMind mitrafertility drvidyalatha hyderabad

18/07/2026

"మొదటి సారి 2–3 నెలల్లోనే గర్భం వచ్చింది కదా... ఇప్పుడు ఎందుకు రావడం లేదు?" అని చాలా మంది అడుగుతుంటారు.

గుర్తుంచుకోండి... అప్పటికి, ఇప్పటికీ మీ శరీరంలో ఎన్నో మార్పులు జరిగి ఉండొచ్చు. జీవనశైలి మారడం, బరువు పెరగడం, అండాల నాణ్యత లేదా వీర్యకణాల నాణ్యత తగ్గడం, థైరాయిడ్ వంటి సమస్యలు రావడం వంటి అనేక కారణాలు గర్భధారణను ప్రభావితం చేస్తాయి.

ఒక సంవత్సరం పాటు ప్రయత్నించినా గర్భం రాకపోతే తప్పకుండా ఫెర్టిలిటీ పరీక్షలు చేయించుకోండి. చిన్న చిన్న మార్పులు, సరైన చికిత్సతో గర్భం దాల్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. మొదటి సారి త్వరగా గర్భం వచ్చినంత మాత్రాన, రెండోసారి కూడా అలాగే వస్తుందని గ్యారంటీ లేదు.

📞 సంప్రదించడానికి కాల్ చేయండి: 7995132701
📍 3వ అంతస్తు, పీఎన్‌పీ టవర్స్, మైస్కేప్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పలగూడ, హైదరాబాద్, తెలంగాణ- 500032
drvidyalatha hyderabad

17/07/2026

మహిళల వయసే కాదు... పురుషుల వయసు కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

చాలామందికి మహిళల వయసు పెరిగితేనే ఫెర్టిలిటీ తగ్గుతుందని తెలుసు. కానీ పరిశోధనలు చెబుతున్న నిజం ఏమిటంటే, పురుషుల వయసు పెరిగేకొద్దీ కూడా వీర్యకణాల నాణ్యత తగ్గుతుంది.
ముఖ్యంగా 40 సంవత్సరాల తర్వాత వీర్యకణాల్లో DNA దెబ్బతినడం, కదలిక (మోటిలిటీ) తగ్గడం, నాణ్యత క్షీణించడం వంటి మార్పులు కనిపించవచ్చు.

అందుకే కుటుంబాన్ని ప్లాన్ చేసేటప్పుడు మహిళలతో పాటు పురుషుల వయసు, ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవడం ఎంతో అవసరం.

📞 సంప్రదించడానికి కాల్ చేయండి: 7995132701
📍 3వ అంతస్తు, పీఎన్‌పీ టవర్స్, మైస్కేప్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పలగూడ, హైదరాబాద్, తెలంగాణ- 500032
drvidyalatha hyderabad

16/07/2026

ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయా? 🍟

ఇది చాలా మందిలో ఉన్న ఒక అపోహ మాత్రమే. ఒకప్పుడు IVFలో పాత చికిత్స విధానాలు ఉపయోగించినప్పుడు కొంతమందికి అండాశయాల అధిక స్పందన వల్ల శరీరంలో ద్రవాల అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉండేది.

అప్పుడు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, అందులో భాగంగా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకోవాలని సూచించేవారు. కానీ ప్రస్తుతం ఆధునిక చికిత్స విధానాల వల్ల అలాంటి అవసరం చాలా వరకు ఉండదు. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల IVF విజయావకాశాలు పెరగవు. తినాలనిపిస్తే తినండి, కానీ విజయానికి కారణమని మాత్రం నమ్మకండి.

వైద్యుల సూచనలను పాటించడమే అత్యంత ముఖ్యం.

📞 సంప్రదించడానికి కాల్ చేయండి: 7995132701
📍 3వ అంతస్తు, పీఎన్‌పీ టవర్స్, మైస్కేప్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పలగూడ, హైదరాబాద్, తెలంగాణ- 500032
drvidyalatha hyderabad

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Vidyalatha Atluri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share