08/06/2026
మంచికి మారుపేరుగా నిలిచి, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా ప్రజల మన్ననలు, ప్రేమాభిమానాలు పొందిన మా నాన్నగారు కీ॥శే॥ శ్రీ పారి రాజశేఖర్ గారు మమ్మల్ని విడిచి 30 సంవత్సరాలు గడిచినా, మీ మధుర స్మృతులు నిత్యం మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నాయి.
ప్రజాసేవే పరమావధిగా భావించి, ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన మీ సేవా తపన, మీ వ్యక్తిత్వం, మీరు నడిచిన విలువల బాట మాకు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం. మీరు నేర్పిన సేవా స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడమే మీకు మేము అర్పించే నిజమైన నివాళి.
మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ, పరలోకంలో మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
డా. పారి చందన స్రవంతి
B.D.S., M.H.A., F.F.AC
TDP రాష్ట్ర కార్యదర్శి
డైరెక్టర్, ఎ.పి. అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APUFIDC)
TDP పరిశీలకులు, కొండేపి నియోజకవర్గం