Sreenivasa children's Hospital

Sreenivasa children's Hospital Neonatal,Pediatric, Adolescents (up to 18 yrs age) care, Emergency centre.Allergy,Asthma care centre

28/08/2026
Namaste.
07/08/2026

Namaste.

Namaste
25/07/2026

Namaste

నమస్తే మన రక్తపోటును ఇంటిలో చెక్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ప్రశాంతమైన వాతావరణంలో నిటారుగా కూర...
22/07/2026

నమస్తే మన రక్తపోటును ఇంటిలో చెక్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ప్రశాంతమైన వాతావరణంలో నిటారుగా కూర్చుని మాట్లాడకుండా బిపి ఆపరేటర్స్ యొక్క కఫ్ మనకు సరిపడా సైజు తీసుకొని ఆ కఫును మన గుండెకు సమాంతరంగా ఉండేటట్లు చూసుకొని తీసుకోవాలి. డిపి చెక్ చేసుకోవడానికి ముందు కాఫీ టీ లాంటివి తీసుకోకూడదు. వాకింగ్ చేసుకుని వచ్చిన తర్వాత లేదా వ్యాయామం చేసిన తర్వాత తీసుకోకూడదు.

నమస్తే.రక్తహీనతను తగ్గించే కొన్ని రకాల ఆహార పదార్థాలు వీటిని మనము ప్రతిరోజు తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత బారిన ...
17/07/2026

నమస్తే.
రక్తహీనతను తగ్గించే కొన్ని రకాల ఆహార పదార్థాలు వీటిని మనము ప్రతిరోజు తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత బారిన పడకుండా కాపాడుకోవచ్చు.పాలకూర..
పాలకూర ఐరన్, ఫోలేట్, విటమిన్ ఏ వంటివాటికి నిలయం. శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. పాలకూరను పప్పు, కూర లేదా సూప్ రూపంలో క్రమంగా తీసుకోవచ్చు. అయితే, పాలకూరలోని ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహించాలంటే.. విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది.
బీట్‌రూట్..శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి బీట్‌రూట్ ఎంతో మంచిది. ఇందులో ఐరన్, ఫోలేట్, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజువారీ సలాడ్లలో భాగంగా లేదా తాజా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
దానిమ్మ..
దానిమ్మ గింజల్లో ఐరన్, విటమిన్-సి తో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్త ప్రసరణను మెరుగు పరచడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంతో పాటు గుప్పెడు దానిమ్మ గింజలు లేదా ఒక గ్లాసు తాజా దానిమ్మ రసం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బెల్లం-శనగలు..
మన పూర్వీకుల కాలం నాటి ఈ సాంప్రదాయ చిరుతిండి శరీరానికి తక్షణ శక్తిని, రక్తాన్ని అందిస్తుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉండగా, వేయించిన శనగలు ప్రోటీన్లు, ఇతర పోషకాలను అందిస్తాయి. సాయంత్రం పూట జంక్ ఫుడ్‌కు బదులుగా దీనిని స్నాక్‌గా తీసుకోవచ్చు. అయితే, మధుమేహం ఉన్నవారు బెల్లాన్ని వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.
పప్పుధాన్యాలు - చిక్కుళ్లు..
కందిపప్పు, పెసరపప్పు, శనగలు, బొబ్బర్లు మరియు వివిధ రకాల చిక్కుడు గింజల్లో ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. శాకాహారులకు ఐరన్ లభించే ఉత్తమ వనరులలో ఇవి ముఖ్యమైనవి. వీటిని ఉడికించి లేదా మొలకెత్తిన గింజల రూపంలో తీసుకోవడం వల్ల పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి.
డ్రై ఫ్రూట్స్..
ఖర్జూరాలు, నల్ల ఎండుద్రాక్షలలో ఐరన్‌తో పాటు అనేక రకాల ఖనిజాలు దాగి ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. రాత్రి వేళల్లో ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది.
సిట్రస్ పండ్లు..
నారింజ, బత్తాయి, ఉసిరి, నిమ్మ, జామకాయ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి నేరుగా ఐరన్‌ను అందించకపోయినా.. మనం తినే ఆహారంలోని ఐరన్‌ను శరీరం సమర్థవంతంగా గ్రహించేలా (Iron Absorption) చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఐరన్ ఆహారంతో పాటు వీటిని కూడా చేర్చుకోవాలి. రక్తహీనత నివారణకు కేవలం ఆహార మార్పులు మాత్రమే కాకుండా తగినంత నీరు తాగడం, చురుకైన జీవనశైలి అవసరం.

Address

Near Gouri Cine Complex, Sreekantam Circle
Anantapur
515005

Website

Alerts

Be the first to know and let us send you an email when Sreenivasa children's Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category