Katuri medical college & Hospital

Katuri medical college & Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Katuri medical college & Hospital, Medical Center, KATURI MEDICAL COLLEGE & HOSPITAL, , CHINNAKONDRUPADU, , GUNTUR,, Guntur.

http://en.wikipedia.org/wiki/Katuri_Medical_College
Katuri Medical College & Hospital is one of the Private Medical colleges in Guntur, India, offering graduate (Masters - MD/MS) and Undergraduate (Bachelors' - MBBS) courses in Medical Sciences.

31/04/2026హైకోర్టులో కాటూరి హాస్పిటల్ వారి మెగా వైద్య శిబిరం:30&31 రెండు రోజులలో హైకోర్ట్ నందు కాటూరి మెడికల్ కాలేజ్ మరి...
31/03/2026

31/04/2026
హైకోర్టులో కాటూరి హాస్పిటల్ వారి మెగా వైద్య శిబిరం:
30&31 రెండు రోజులలో హైకోర్ట్ నందు కాటూరి మెడికల్ కాలేజ్ మరియు కళాశాల ఆధ్వర్యంలో మెగా మెడికల్ కాంప్ నిర్వహించి ఉన్నారు. ఈ క్యాంప్ లో ఉచితంగా బిపి, షుగర్ టెస్ట్, ఈ.సి.జీ, టు.డి.ఏకో, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్ రే, సి.బి.పి, యూరిన్ అనాలసిస్ మరియు అన్ని విభాగాలుకు సంబంధించిన వైద్య సేవలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమని హానరబుల్. జస్టిస్ శ్రీ ధీరజ్ సింగ్ ఠాకూర్
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు నుండి న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు కెవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి సుబోద్, బార్ కౌన్సిల్ సభ్యులు చిదంబరం, న్యాయవాది నర్రా శ్రీనివాస్ రావు గారు వారి తోటి సహచరులు కూడా పాల్గొన్నారు. అలాగే హాస్పిటల్ నుండి మెడికల్ సూపరిటెండ్ డాక్టర్ వై. కిరణ్ కుమార్ గారు, డాక్టర్.ఫణీంద్ర గారు,వంద మంది వైద్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొని వెయ్యి మందికి పైగా వైద్య సేవలు అందించారు. ఇటువంటి సేవలు అందిస్తున్న కాటూరి సుబ్బారావు గారికి మరియు డైరెక్టర్ డాక్టర్. స్వైర రావు గార్లకి లాయర్ అసోసియేషన్ తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణంలో  కాటూరి మెడికల్ కాలేజీ & హాస్పిటల్ వారి రెండు రోజులు ఏర్పాటు చేయబడిన ఉచిత మెగా వై...
30/03/2026

ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణంలో కాటూరి మెడికల్ కాలేజీ & హాస్పిటల్ వారి రెండు రోజులు ఏర్పాటు చేయబడిన ఉచిత మెగా వైద్య శిబిరం భాగంగా మొదటి రోజు కార్యక్రమం

మంచి మనసున్న మా ప్రధాత మా కాటూరి అధినేత
22/03/2026

మంచి మనసున్న మా ప్రధాత మా కాటూరి అధినేత

కాటూరి మెడికల్ కాలేజీలో 13,14&15 తారీకులో IPHACON 2026 70th Annual National Conference శాస్త్రీయ సదస్సులు ఘనంగా జరిగాయి....
17/03/2026

కాటూరి మెడికల్ కాలేజీలో 13,14&15 తారీకులో IPHACON 2026 70th Annual National Conference శాస్త్రీయ సదస్సులు ఘనంగా జరిగాయి.
​గుంటూరు:
కాటూరి మెడికల్ కాలేజీ సామాజిక వైద్య విభాగంలో జరిగిన 70వ ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ వార్షిక జాతీయ సదస్సులును ఎన్ టి ఆర్. యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్.టీ. సాయి సుధీర్ గారు ప్రారంభించారు. ఈ మూడు రోజులు (IPHACON 2026) అత్యంత ఉత్సాహంగా సాగాయి. దేశవ్యాప్తంగా విచ్చేసిన ప్రజారోగ్య నిపుణులు, వైద్యులు వివిధ అంశాలపై చర్చా గోష్టులు నిర్వహించారు అలాగే సాంకేతిక విప్లవం మరియు మానసిక ఆరోగ్యం
​సదస్సు డిజిటల్ యుగంలో వైద్య సేవలు మరియు మానసిక ఆరోగ్య వ్యవస్థల బలోపేతంపై ప్రధానంగా చర్చలు జరిగాయి.
​డిజిటల్ హెల్త్ & హ్యూమన్ ఫ్యాక్టర్స్: 'డిజిటల్ సీలో అనలాగ్ యాంకర్' అనే అంశంపై డాక్టర్ ఉష మంజునాథ్ మరియు డాక్టర్ ఆకాష్ బృందం ప్రసంగించారు. క్లినికల్ వర్క్‌ఫ్లోలో సాంకేతికతతో పాటు మానవీయ కోణాన్ని ఎలా మేళవించాలో వివరించారు.
​మెమొరియల్ ఒరేషన్: డాక్టర్ రాజేష్ కుమార్ మరియు డాక్టర్ మన్మీత్ కౌర్ నేతృత్వంలో 'డాక్టర్ కె.ఎన్. రావు మెమొరియల్ ఒరేషన్ 2026' నిర్వహించబడింది.
​ప్రజారోగ్య హ్యాకథాన్: డాక్టర్ వై. విజయకృష్ణ బృందం ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ హ్యాకథాన్ నిర్వహించి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించారు.
​మానసిక ఆరోగ్యం: మానసిక ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన పరిశోధనలపై డాక్టర్ నీతి రుస్తాగి, డాక్టర్ అశూ గ్రోవర్ మరియు ఇతర నిపుణులు చర్చించారు.
​పబ్లిక్ హెల్త్ క్విజ్: సాయంత్రం వేళలో డాక్టర్ అభిషేక్ దే బృందం నిర్వహించిన 'డాక్టర్ దేవకీ నందన్ మెమొరియల్ క్విజ్' సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా వివిధ విభాగాల్లోనీ విజేతలుకు బహుమతులు ప్రదానం చేయటం జరిగింది.
IPHACON 2026 సదస్సుకు హాజరైన ప్రతినిధులు కాటూరి మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక మౌలిక సదుపాయాలను మరియు సౌకర్యాలను అందించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన చైర్మన్ కాటూరి సుబ్బారావు డైరెక్టర్ డాక్టర్. స్వైర రావు గార్లకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

To day world kidney Day Celebrations katuri medical college and hospital
12/03/2026

To day world kidney Day Celebrations katuri medical college and hospital

10-03-26*కట్రపాడులో కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉచిత మెగా వైద్యశిబిరం*కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ చైర్మన్ కాటూ...
11/03/2026

10-03-26

*కట్రపాడులో కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉచిత మెగా వైద్యశిబిరం*

కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ చైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ డాక్టర్ స్వైరారావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కట్రపాడు పునీత మదర్దరిస కల్యాణ మండపంలో మంగళవారం ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. జిల్లాలో మొదటిసారిగా అత్యాధునిక సౌకర్యం కలిగిన రూ. కోటిన్నర విలువగల ప్రత్యేక వాహనంలో అవసరమైన వారికి (ఆర్ బీఎస్) షుగర్ పరీక్ష సీబీపీ రక్త పరీక్ష ఈసీజీ, 2d ఎకో గుండె పరీక్ష,బాడీ స్కాన్,ఎక్స్ రే పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ శిబిరంలో కాటూరి మెడికల్ కాలేజీ, మెడికల్ సూపెరిటెండే డాక్టర్.వై.కిరణ్ కుమార , డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.అజయ్ గార్ల లతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించి నిపుణులైన డాక్టర్లు మొత్తం 60 మంది సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో మూడు వందలకు మందికి కట్రపాడు వారితో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారికి ఉచిత పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. వంద మందికి వ్యాధి నిర్ధారణ చేసి మెరుగైన వైద్యం కోసం కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు రిఫర్ చేశారు. కూటమి మండల నాయకుడు మామిళ్లపల్లి రాంగోపాల్ ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. శౌరి బాబు,గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు, కార్యకర్తలు తదితరులు పర్యవేక్షించారు.
తమ కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో అన్ని వ్యాధులకు వైద్య చికిత్సలు చేస్తున్నామని.. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తున్నందున ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మెడికల్ సూపరిటెండ్ డాక్టర్.వై.కిరణ్ కుమార్ గారు సూచించారు. తమ చైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ స్వైరారావు గార్లు ఇంత భారి ఎత్తున నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇటువంటి వైద్య శిబిరం కాకుమానులో నిర్వహించినందుకు
కాటూరి సుబ్బారావు, డాక్టర్ స్వైరారావులకు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు, మార్కెటింగు సిబ్బంది,మరియు మీడియా కోర్డినేటర్,వైద్య కళాశాల సిబ్బంది తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

11/03/2026
06-03-26*కాకుమానులో కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉచిత మెగా వైద్యశిబిరం*కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ చైర్మన్ కాటూ...
06/03/2026

06-03-26

*కాకుమానులో కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉచిత మెగా వైద్యశిబిరం*

కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ చైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ డాక్టర్ స్వైరారావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాకుమాను చెన్నకేశవ ఆలయంలొ శుక్రవారం ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. జిల్లాలో మొదటిసారిగా అత్యాధునిక సౌకర్యం కలిగిన రూ. కోటిన్నర విలువగల ప్రత్యేక వాహనంలో అవసరమైన వారికి (ఆర్ బీఎస్) షుగర్ పరీక్ష సీబీపీ రక్త పరీక్ష ఈసీజీ, 2d ఎకో గుండె పరీక్ష,బాడీ స్కాన్,ఎక్స్ రే పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ శిబిరంలో కాటూరి మెడికల్ కాలేజీ, మెడికల్ సూపెరిటెండే డాక్టర్.వై.కిరణ్ కుమార్ గార్ల లతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించి నిపుణులైన డాక్టర్లు మొత్తం 60 మంది సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో నాలుగు వందలకు మందికి కాకుమాను వారితో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారికి ఉచిత పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. వంద మందికి వ్యాధి నిర్ధారణ చేసి మెరుగైన వైద్యం కోసం కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు రిఫర్ చేశారు. కూటమి మండల నాయకుడు మామిళ్లపల్లి రాంగోపాల్ ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. బోడపటి శివ ప్రసాద్ గ్రామ సర్పంచ్, నల్లమోతు పూర్ణచంద్ర రావు గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పర్యవేక్షించారు.
తమ కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో అన్ని వ్యాధులకు వైద్య చికిత్సలు చేస్తున్నామని.. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తున్నందున ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మెడికల్ సూపరిటెండ్ డాక్టర్.వై.కిరణ్ కుమార్ గారు సూచించారు. తమ చైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ స్వైరారావు గార్లు ఇంత భారి ఎత్తున నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇటువంటి వైద్య శిబిరం కాకుమానులో నిర్వహించినందుకు
కాటూరి సుబ్బారావు, డాక్టర్ స్వైరారావులకు బోడపటి శివ ప్రసాద్ గ్రామ సర్పంచ్, నల్లమోతు పూర్ణచంద్ర రావు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు, మార్కెటింగు సిబ్బంది,మరియు మీడియా కోర్డినేటర్,వైద్య కళాశాల సిబ్బంది తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

27/02/2026
26/02/2026

కాటూరి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25 వ తేదీ 2026 ఉదయం 11 గంటలకు ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నసీర్ గారు మరియు డాక్టర్.చంద్రశేఖర్ శంకురాత్రి , సంకురాత్రి ఫౌండేషన్ కాకినాడ వ్యవస్థాపకులు. వారి చేతులు మీదుగా అత్యంత ఆధునిక గుండె వైద్యానికి కాత్ ల్యాబ్ మరియు అడ్వాన్స్డ్ గుండెశస్త్రచికిత్స ఆపరేషన్ థియేటర్ ప్రారంభించారు. ఇలాంటి సేవలను ప్రజలు అందిస్తున చైర్మన్ కాటూరి సుబ్బారావు , డైరెక్టర్ డాక్టర్ స్వైర రావు గార్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవలను ప్రజలు అందరూ వినియోగించుకోగలరు అని చెప్పారు. అనంతరం
గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వైద్య విద్యార్థులకు ప్రజలుకి వైద్య సేవలు అందించే అవకాశం వచ్చినందుకు గర్వపడాలని అదేవిధంగా పేద,ధనిక బేధం లేకుండా సేవలను అందించాలని విద్యార్థులకు సూచించారు. తరవాత సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందించారు.ఈ కార్యక్రమం చాలా వైభవం గా జరగటానికి సహకారించిన విద్యార్థులకు , పేరెంట్స్ కు కృతజ్ఞతలు తెలిపారు మెడికల్ సూపరిటెండ్. డాక్టర్ ఏ.కిరణ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చైతన్య గారు, డీన్.డాక్టర్.చల్లా.మోహనరావు గారు, డిప్యూటీ సూపరిటెండ్.డాక్టర్.అజయ్ గారు, వైస్ ప్రిన్సిపల్.డాక్టర్. ఫణీంద్ర గారు, సి.ఓ.ఓ.తుషార్ గారు, హాస్పిటల్, కళాశాల సిబ్బంది మరియు మీడియా పోలీస్ ప్రతినిధులు పాల్గొనారు.

Address

KATURI MEDICAL COLLEGE & HOSPITAL, , CHINNAKONDRUPADU, , GUNTUR,
Guntur

Alerts

Be the first to know and let us send you an email when Katuri medical college & Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Katuri medical college & Hospital:

Shortcuts

Share

Category