Rajithasri Astro

Rajithasri Astro This is a comprehensive astrology study that includes predictions for health, education, job, love, marriage, children, and finances, among other things.

06/06/2026

భాను సప్తమి అంటే సప్తమి తిథి ఆదివారంతో కలిసిన రోజు. సప్తమి తిథి సూర్యునికి చెందినది, అదే రోజు ఆదివారం కూడా సూర్యుని రోజు కావడంతో ఈ రెండు కలిసినప్పుడు సూర్య శక్తి చాలా బలంగా పనిచేస్తుందని చెప్తారు.
ఈ రోజును భాను సప్తమి, విజయ సప్తమి లేదా శత్రు క్షయ సప్తమి అని కూడా అంటారు. ఈ రోజున సూర్యుడిని పూజిస్తే ఆరోగ్యం మెరుగవడం, ఆత్మవిశ్వాసం పెరగడం, పనుల్లో విజయాలు రావడం, శత్రు బాధలు తగ్గడం వంటి ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంది.
ఈ రోజు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. కంచు పాత్రలో నీరు తీసుకుని అందులో కొద్దిగా పువ్వులు, బియ్యం లేదా కుంకుమ వేసి ఉదయించే సూర్యునికి సమర్పించాలి. తర్వాత ఆదిత్య హృదయం లేదా సూర్య స్తోత్రం చదవడం మంచిది.
మనసులో ఒక సంకల్పం తీసుకుని, ఈ రోజు సూర్యుడిని భక్తితో పూజిస్తున్నాను అని చెప్పుకోవాలి. మధ్యాహ్నం లోపల పూజ పూర్తి చేయడం మంచిది.
ఈ రోజున కోపం, వాదనలు, తామసిక అలవాట్లు తగ్గించి సాత్వికంగా ఉండటం మంచిది. ఆహారం కూడా తేలికగా, శుభ్రంగా తీసుకుంటే ఇంకా మంచిది.
సులభమైన పరిహారంగా ఉదయం సూర్యునికి నీటితో పాటు కొద్దిగా బెల్లం వేసి అర్ఘ్యం ఇచ్చి “ఓం ఘృణి సూర్యాయ నమః” 11 సార్లు జపించాలి. తర్వాత గోధుమలు లేదా బెల్లం దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు.
మొత్తం గా భాను సప్తమి అంటే సూర్య శక్తిని మేల్కొలిపే ఒక పవిత్ర రోజు అని అర్థం.

04/06/2026

గురు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటకం చంద్రుని రాశి, అలాగే తల్లి, ప్రేమ, పోషణ, సంరక్షణకు సూచిక. అందువల్ల తల్లికి సంబంధించిన కొన్ని మంచి పనులు చేయడం ద్వారా గురు అనుగ్రహం, ఆశీర్వాదం పొందవచ్చని జ్యోతిష్య పరంగా భావిస్తారు. రాశుల వారీగా చేయదగిన చిన్న పరిహారాలు ఇవి: 🙏✨
♈ మేష రాశి / లగ్నం అమ్మకు కొత్త బట్టలు లేదా ఆమెకు నచ్చిన వస్తువు కొనిపెట్టండి.
♉ వృషభ రాశి / లగ్నం అమ్మకు ఇష్టమైన భోజనం పెట్టండి లేదా ఆమెను భోజనానికి తీసుకెళ్లండి.
♊ మిథున రాశి / లగ్నం అమ్మకు కొంత డబ్బు ఇచ్చి, "నీకు నచ్చినట్టు ఖర్చు చేసుకో" అని చెప్పండి.
♋ కర్కాటక రాశి / లగ్నం అమ్మతో సమయం గడిపి, ఆమె మనసులోని మాటలను ప్రేమగా వినండి.
♌ సింహ రాశి / లగ్నం అమ్మ పేరుతో దానం చేయండి లేదా అవసరమైన వారికి సహాయం చేయండి.
♍ కన్య రాశి / లగ్నం అమ్మకు నచ్చిన వస్తువు కొనిపెట్టండి లేదా ఆమె మనసులో ఉన్న కోరికను నెరవేర్చండి.
♎ తుల రాశి / లగ్నం అమ్మ చాలా కాలంగా కోరుకుంటున్న ఒక విషయాన్ని పూర్తి చేయండి.
♏ వృశ్చిక రాశి / లగ్నం అమ్మను తీసుకుని ఒక దేవాలయ దర్శనం చేయించండి.
♐ ధనుస్సు రాశి / లగ్నం అమ్మకు ఆధ్యాత్మిక లేదా జ్ఞానానికి సంబంధించిన పుస్తకం బహుమతిగా ఇవ్వండి.
♑ మకర రాశి / లగ్నం అమ్మ ఇంటి పనుల్లో సహాయం చేసి ఆమెకు విశ్రాంతి కల్పించండి.
♒ కుంభ రాశి / లగ్నం అమ్మకు అవసరమైన ఏదైనా వస్తువు కొనిపెట్టండి.
♓ మీన రాశి / లగ్నం అమ్మ ఆశీర్వాదం తీసుకుని, ఆమె చేతితో ఏదైనా తీపి పదార్థం తినండి.
🌸 అన్ని రాశుల వారికి ఒకే పరిహారం:
అమ్మకు నమస్కరించి, ఆమె ఆశీర్వాదం తీసుకోవడం. తల్లి సంతోషంలోనే గురు కృప దాగి ఉంటుందని పెద్దలు చెబుతారు. 🙏💛

01/06/2026

చాలామంది గురుగ్రహ మార్పు గురించి అడుగుతున్నారు. ఇది మీ వ్యక్తిగతంగా కంటే ప్రపంచం పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం,దాదాపు అన్ని ధరలు పెరుగుతాయి అలా ప్రజలకు ఇబ్బంది అవుతుంది .కాబట్టి డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది అలాగే శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి రోజు ఒక 15 mins ప్రాణాయామం చేయడం మంచిది.

31/05/2026

జీవితంలో ఎలాంటి మార్పు రావడం లేదు ఎంత చేసిన జీవితంలో కష్టాలే ఉంటున్నాయి అనిపించే వారికోసం ఇది
* ప్రతి శనివారం ఏదైనా గుడిలో చెప్పుల స్టాండ్ లో చెప్పులు అన్ని నీట్ గా పెట్టండి .
* శనివారం చెప్పులు వేసుకోకుండా ఉండండి
* శనివారం ఉపవాసం ఉండడం ఏదైనా గుడిలో సేవ అలాగే అక్కడ ఉచిత అన్నదానం లో భోజనం చేయడం క్లీన్ చేయడం చేయండి ,
*కొండ పైన ఉన్న ఆలయాలు సందర్శించండి .
* నలుపు , blue colour డ్రెస్సెస్ వేసుకోకూడదు

15/05/2026

రేపు అమావాస్య తల్లిదండ్రులు ఉన్నవారు తలస్నానం చేయకూడదు.శనిదోషం ఎక్కువగా ఉన్నవారు ఏం పని చేసిన అస్సలు కలిసి రావడం లేదు అనుకున్న వారు మీరు వాడే చెప్పులు ఏదైనా చౌరస్తా లో వదిలేసి రావాలి.అలాగే ఏదైనా కొండ పైన ఉన్న గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి.అలాగే రేపు ఉదయం గుడికి వెళ్ళి శుభ్రం చేయండి.రేపు ఉపవాసం ఉండండి.

14/05/2026

శని జయంతి & శనిశ్చరి అమావాస్య
★ 16 మే 2026, శనివారం

ఈ రోజు చాలా పవిత్రమైనది. శని జయంతి శనివారం రావడం వల్ల దీనిని శనిశ్చరి అమావాస్య అంటారు. ఈ రోజు శని దేవుని ఆశీర్వాదం కోసం చేసే పూజలు, దానాలు ఎంతో ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ రోజు ప్రత్యేకంగా ఎవరు ఆచరించాలి?
• ఏలినాటి శని / సాడేసాతి ఉన్నవారు
• శని మహాదశ నడుస్తున్నవారు
• పితృ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు
• జీవితంలో అడ్డంకులు, ఆలస్యం, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నవారు

ఏం చేయాలి?
• ఉదయం స్నానం చేసి శని దేవుని ప్రార్థించాలి
• పీపల్ చెట్టు (రావి చెట్టు) వద్ద నీరు పోయాలి
• “ఓం శం శనైశ్చరాయ నమః” 108 సార్లు జపించాలి
• నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపం వెలిగించాలి
• కాకులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టాలి
• నల్ల ఉలవలు, నల్ల బట్టలు, ఇనుప వస్తువులు దానం చేయాలి

ఈ రోజు చేసే పూజలు:
✔ కర్మ దోషాల శాంతి
✔ పితృ ఆశీర్వాదం
✔ మానసిక ధైర్యం
✔ ఆర్థిక స్థిరత్వం
✔ అడ్డంకుల తొలగింపు కలిగిస్తాయని నమ్మకం.

శని దేవుడు శిక్షించడానికి కాదు… మన కర్మను సరిదిద్దడానికి వస్తాడు.
భక్తితో ప్రార్థిస్తే ఆయన కృప తప్పకుండా లభిస్తుంది. 🖤🙏

11/05/2026

Even if there are doshas in your horoscope, if things are not happening as expected, or if life feels very difficult, tomorrow is Hanuman Jayanti, observed on the Vaishakha Masa Krishna Paksha Dashami. From tomorrow until Amavasya, whoever sincerely follows a discipline like reciting the Hanuman Chalisa daily, offering betel leaf पूजा (Aaku Puja) or Sindoor Puja to Lord Hanuman, or doing Sundarakanda Parayanam with devotion, will definitely see their wishes being fulfilled and the negative effects in the horoscope gradually reducing.

11/05/2026

జాతకం లో దోషాలు ఉన్నా,అనుకున్న పనులు అవ్వడం లేదు అన్న,జీవితం చాలా కష్టంగా ఉన్న రేపు వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి రోజు స్వామి హనుమ జయంతి ,ఈరోజు నుంచి అమావాస్య వరకు ఎవరు అయినా నియమంగా హనుమాన్ చాలీసా చదవడం లేదా స్వామి కి ఆకు పూజ సింధూర పూజ చేయించడం ,లేదా సుందరకాండ పారాయణం చేయడం ఇలా ఏదైనా నియమంగా చేస్తూ3 తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అలాగే జాతక దోషాలు తగ్గుతాయి .

Address

Hyderabad

Telephone

+916301219991

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajithasri Astro posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Rajithasri Astro:

Share