Mana Telugu Rashtralu

Mana Telugu Rashtralu 🗞️ Mana Telugu Rashtralu
📍 Andhra Pradesh & Telanaga Updates
🗣️ People’s Voice | Ground Reality
📲 Follow for Real AP&TG News

28/05/2026

అధిష్ఠానం ఆదేశంతోనే రాజీనామా చేశా: సిద్దరామయ్య

బెంగళూరులోని లోక్‌భవన్‌లో రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత డీకే శివకుమార్‌తో కలిసి ‌సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. ‘అధిష్ఠానం ఆదేశంతోనే సీఎం పదవికి రాజీనామా చేశా. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీకి దాన్ని అందజేశా. ఆయన వచ్చాక రాజీనామాను ఆమోదిస్తారు. అధిష్ఠానం నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. ఇకపైనా రాజకీయాల్లో కొనసాగుతా. ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తా’ అని స్పష్టం చేశారు.





23/05/2026

కారుతో ఢీకొట్టి

TG: హైదరాబాద్‌ మాసబ్ ట్యాంక్‌లో సీనియర్ అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో కారుతో ఢీకొట్టారు. కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ మొయినుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. వక్ఫ్ భూములు కాపాడేందుకు ప్రయత్నిస్తున్న తన తండ్రిని ప్రత్యర్థులే హత్య చేశారని ఆయన కొడుకు ఫర్హాన్ ఆరోపించారు.





20/05/2026

Hyderabad మణికొండ పరిధిలో ఓ మహిళ పట్ల సైకో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా పోలీసులు బాధిత మహిళను గుర్తించారు. ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. నిందితుడిని టీనేజర్‌గా అనుమానిస్తుండగా, ఆనవాళ్ల కోసం ఆ ఏరియాలోని 50-60 CC కెమెరాల ఫుటేజ్ పరిశీలించామన్నారు. ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు





20/05/2026

పాస్టర్‌పై దాడి.. ట్విస్ట్?

అల్లూరి జిల్లాలో సంచలనం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. సానుభూతి కోసం కడపకు చెందిన పాస్టర్ అభినయ్ దాడి చేయించుకున్నారని, జరిగిందంతా పక్కా డ్రామాగా పలు ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వైజాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను రేపు పోలీసులు వెల్లడించనున్నారు.





18/05/2026

విశాఖ:
ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళల చేతివాటం
కాకినాడ వెళ్ళేందుకు బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలు వద్ద బంగారం కాజేసిన ఇద్దరు మహిళలు
బస్సు ఎక్కుతున్నట్టే ఎక్కుతూ బ్యాగులో నుంచి బంగారు నగలు అపహరణ
35 తులాల బంగారు ఆభరణాలు చోరీ
పరారీలో ఇద్దరు మహిళలు నిందితులు
సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు




16/05/2026

కన్నబిడ్డల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన తల్లి

బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్‌లో ఓ తల్లి సాహసం అందరినీ కంటతడి పెట్టించింది. ఇద్దరు పిల్లలతో ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. తప్పించుకునే దారి లేకపోవడంతో, ఆమె పిల్లలను హత్తుకుని ప్లాట్‌ఫామ్‌కు, ట్రాక్‌కు మధ్య ఉన్న ఇరుకైన సందులో పడుకుంది. రైలు వెళ్లే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలను కాపాడుకుంది. ఈ ఘటనలో ముగ్గురూ సురక్షితంగా బయటపడగా, అక్కడ వంతెన లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




15/05/2026

ఓ మహిళ నగల దుకాణంలోకి వెళ్లి… షాప్ యజమాని కళ్లలో కారం పొడి చల్లి బంగారం దోచుకునేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. 😳💥

అయితే అప్రమత్తమైన దుకాణ యజమాని వెంటనే ఆమెను పట్టుకుని అడ్డుకున్నాడు.
దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.




14/05/2026

ప్రధాని మోదీ పిలుపుతో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు తమ కాన్వాయ్‌లను సగానికి సగం తగ్గించారు. ఇవాళ వారంతా తక్కువ వాహనాలతోనే సచివాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కేవలం 4 కార్లతోనే రాగా ,
పవన్, లోకేశ్ 2 చొప్పున, నాదెండ్ల 3, అచ్చెన్నాయుడు ఒక వాహనంతో వచ్చారు. ఇంధనం వినియోగాన్ని తగ్గించాలంటూ అంతకుముందు మోదీ కూడా తన కాన్వాయ్‌ని కుదించిన విషయం తెలిసిందే.




14/05/2026

సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గజసింగారం బస్టాప్ వద్ద బస్సు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి ఓ స్కార్పియో దూసుకెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మి(35) అనే మహిళ మృతిచెందారు. మరో మహిళతో పాటు బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన స్కార్పియోను స్థానికులు వెంబడించి ఆపారు. బస్సు పక్కనే ఉన్న ఆ వాహనం వేగం కంట్రోల్ కాకపోవడం వల్లే ఘటన జరిగినట్లు తెలుస్తోంది.




12/05/2026

ఒక్క విషయం అయినా ఈ రోజు నేర్చుకోవాలంటే…
🚦 “ఆగు – చూడు – ముందుకు వెళ్లు” అనే అలవాటు నేర్చుకోండి.

రోడ్డుపై చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు.
మీ భద్రత… మీ చేతుల్లోనే ఉంది.




12/05/2026

హైదరాబాద్‌లో దారుణం

బాలూడిపై దాడి చేసిన 10 వీధి కుక్కలు

వేసవి సెలవుల కోసం సిద్ధిపేట నుండి బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీకి వచ్చిన ఆద్విక్ అనే బాలుడు

ఇంటి బయట ఆడుకుంటుండగా బాలుడిపై దాడి చేసిన 10 వీధి కుక్కలు

వీధి కుక్కల దాడిలో తలపై చర్మం ఊడిపోయి తీవ్ర గాయలపాలవ్వడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స

వీధి కుక్కలతో తరచూ ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు.


Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Telugu Rashtralu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share