ఆరోగ్య వ్యాసాలు Health Articals

ఆరోగ్య వ్యాసాలు  Health Articals Ayurarogyalu

17/09/2026
15/09/2026

• బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలంటే..!

చాలామంది ప్రముఖులు తాము ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తామని చెబుతుంటారు. దైవచింతనకూ బ్రహ్మముహూర్తాన్ని మించింది లేదనేదీ తెలిసిందే. మనకు అందుబాటులో ఉన్న ఇరవైనాలుగ్గంటల్లో బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం.... ఆ సమయంలో నిద్రలేస్తే మంచిదని చెప్పడం వెనుక ఉన్న లాభాలేంటో తెలుసుకుందామా...

బ్రహ్మముహూర్త సమయం... దీన్నే అమృత సమయమనీ, బ్రహ్మకాలమనీ అంటారు. ఇది బ్రహ్మకు సంబంధించిన సమయం కాబట్టే ఆ పేరు వచ్చింది. తెల్లవారు జామున మూడున్నర- మూడు ముప్పావు నుంచి అయిదు- అయిదన్నర గంటల మధ్యలో ఉన్న కాలానికే బ్రహ్మముహూర్తమని పేరు. పూర్వం మహర్షులు, రుషులు ఆధ్యాత్మిక చింతన చేసేందుకు ఈ పవిత్రమైన సమయాన్నే ఎంచుకునేవారట. ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్లు కూడా సంగీత సాధనకూ, చదువుకునేందుకూ పిల్లల్ని బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేపేవారు.

సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా గంటా ముప్ఫైఆరు నిమిషాల ముందుగా వచ్చే ఈ సమయంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని.. ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు... ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు (అనూరుడు అనే పేరూ ఉంది) ఎర్రని కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత అరుణ కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం... ఆహ్లాదకరంగా అనిపించడంతోపాటు శరీరానికి విటమిన్‌ డి కూడా పుష్కలంగా అందిస్తుంది. ఇక, బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల కలిగే లాభాలను గమనిస్తే ఈ సమయంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి శబ్దమూ వినిపించదు. దాంతో దైవారాధన చేసినా, విద్యార్థులు చదువుకున్నా, ఏదయినా ఓ పనిని చేపట్టినా ఏకాగ్రతతో పూర్తిచేస్తాం. మనసు చేస్తున్న పనిపైనే లగ్నం అవుతుంది. ఇంద్రియాలూ అప్రమత్తంగా పనిచేస్తాయి. అన్నింటికీ మించి మెదడు పనితీరూ చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలూ చెబుతున్నారు. వీటన్నింటిద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది. ఆ ప్రభావం మిగిలిన రోజుపైనా పడి క్రమంగా నెగెటివ్‌ ఆలోచనలు దూరమవుతాయని పరిశోధనల్లోనూ తేలింది. అంతేకాదు... ఈ సమయంలో గాలి కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగానూ ఉంటుంది. ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది. వీటన్నింటి కారణంగా జీర్ణ వ్యవస్థ, జీవక్రియల పనితీరూ మెరుగ్గా ఉంటుంది.ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలూ, ధ్యానం వంటివి చేయాలనుకునేవారికీ, వ్యక్తిగత అభివృద్ధికోసం దృష్టిపెట్టే వారికీ ఇదే సరైన సమయమని చెబుతారు.

#ఆయురారోగ్యాలు #మంచిఆరోగ్యం

09/09/2026

Address

Hyderabad
500090

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919866555598

Alerts

Be the first to know and let us send you an email when ఆరోగ్య వ్యాసాలు Health Articals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share