Dr.Yashoda Hospital

Dr.Yashoda Hospital Achivements
----------------------
Best Doctor Award
Mother Teressa Award
Vaidya Siromani Award
Indi

గర్భం దాల్చిన తరువాత పోషకాహారమే సేవిస్తున్నప్పటికి, బిడ్డ ఎదుగుదలకు సంబంధించి తగిన ముందు జాగ్రత చర్యలు పాటించినప్పటికీ, ...
03/05/2018

గర్భం దాల్చిన తరువాత పోషకాహారమే సేవిస్తున్నప్పటికి, బిడ్డ ఎదుగుదలకు సంబంధించి తగిన ముందు జాగ్రత చర్యలు పాటించినప్పటికీ, గర్భం దాల్చిననాటి నుంచి స్త్రీ కాన్పు సమయం వరకూ కొన్ని రకాల అనారోగ్యాలకు గురికాక తప్పదు...
వాటిలో కొన్ని సర్వసాధరణమైన సమస్యలను కింద పేపర్ ఆర్టికల్లో వివరంగా ఇవ్వబడినాయి అవగాహన కోసం చదువుకోగలరు.

ఇవి సర్వసాధరణమైనప్పటికి సరైన డాక్టర్ పర్యవేక్షణలో సలహాలు, చికిత్స తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

అసలు ఇలాంటి సమస్యలకు గల కారణాలు, వాటికి తాత్కాలిక ఉపశమన విధానాలు కూడా వివరించటం జరిగింది.
మీ ఇంట్లో గాని, మీ ఫ్రెండ్స్ లోగాని ఎవరైన బాలింతలుంటే అవగాహన కోసం ఈ ఆర్టికల్ షేర్ చేసి సెండ్ చేయండి వారికి చాలా ఉపయోగపడుతుంది....

థాంక్యూ.
© Dr-Yashoda Penubala

గర్భిణి స్త్రీలలో కొద్దిపాటి పొత్తి కడుపు నొప్పి సహజ లక్షణమే౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼గర్భాశయంలో బిడ్డ ఎదుగుదల కారణంగాగర్భ సంచి...
30/04/2018

గర్భిణి స్త్రీలలో కొద్దిపాటి పొత్తి కడుపు నొప్పి సహజ లక్షణమే
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
గర్భాశయంలో బిడ్డ ఎదుగుదల కారణంగా
గర్భ సంచి చుట్టూ వున్న అవయవాలు వాటి స్థానం నుంచి కొద్దిగా పక్కకు జరగాల్సి రావడం మరియు గర్భాశయ కండరాలు స్ట్రెచ్ కావటం వలన కూడా
కొద్దిపాటి పొత్తి కడుపు నొప్పి సహజమే....అటువంటి నొప్పికి భయ పడాల్సిన పని లేదు...దానికదే సర్దు కుంటుంది....

భరించలేనంత పొట్ట నొప్పి తో ఇతరత్రా లక్షణాలు వున్నపుడు మాత్రం తగు జాగ్రత్త వహించాలి...

మొదిటిసారిగా గర్భం ధరించినపుడు చాల మంది స్త్రీలు
ఏ చిన్నపాటి ఇబ్బంది కలిగినా సరే తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు. అలా టెన్షన్ పడటం తల్లి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలాంటి సందేహాలను డాక్టర్ని సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.

© Dr.Yashoda penubala
MD OBS &GYN -AYU

గర్భిణీ స్త్రీలు జాగ్రత్త పడాల్సిన సందర్భం __________________________గర్భం దాల్చిన మొదటి నెలల్లో ఎక్కువ వాంతులు కావడం, వ...
24/04/2018

గర్భిణీ స్త్రీలు జాగ్రత్త పడాల్సిన సందర్భం
__________________________

గర్భం దాల్చిన మొదటి నెలల్లో ఎక్కువ వాంతులు కావడం, వాంతి వస్తూన్నట్టు వుండడం అనే సమస్యలతో గర్భిణీలు ఇబ్బంది పడుతుంటారు. ఇలా కావడానికి కారణం గర్భం కారణంగా HCG హోర్మోన్ ఎక్కువ విడుదల కావడమే.....

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువ మోతాదులో పాలు తాగడం,దానిమ్మ పళ్ళు తినడం మంచిది.మాదీఫల రసాయనం అనే ఆయుర్వేద సిరప్ ఈ సమస్యకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.....

ఎక్కువ సార్లు వాంతులవుతున్నా ,మందులతో వాంతులు ఆగకున్నా, పిండం నిర్మాణంలో లోపాలుగానీ కవల పిల్లలు( twins ) ముగ్గురు పిల్లలు(triplets ) తల్లి గర్భంలో ఎదగడం కూడా కారణం కావొచ్చు అలాంటపుడు ఏమి తిన్నా నిలవకుండా ఎక్కువ సార్లు వాంతులవుతూ వుంటాయి.....

అలాంటపుడు ఇది సాధారణ లక్షణమే అని అశ్రద్ద చేయకుండా తగు జాగ్రత్తలు పాటించాలి
అవసరమగు వైద్య పరీక్షలు చేయించాలి డాక్టర్ సలహా మేరకు.........!!!

డా.యశోద పెనుబాల
ప్రసూతి &స్త్రీల వైద్య నిపుణులు (Ayu)

సాధారణంగా స్త్రీలలో సంతానలేమి కి కారణమయ్యే అంశాల్లో ట్యూబల్ బ్లాక్ ప్రధాన కారణం ...ట్యూబ్లు ఓపెన్ కావడానికి అల్లోపతిలో ఎ...
20/04/2018

సాధారణంగా స్త్రీలలో సంతానలేమి కి కారణమయ్యే అంశాల్లో ట్యూబల్ బ్లాక్ ప్రధాన కారణం ...

ట్యూబ్లు ఓపెన్ కావడానికి అల్లోపతిలో ఎలాంటి మందులు లేవు .....

ప్రత్యామ్నాయంగా టెస్ట్ట్యూబ్ బేబీ కి వెళ్ళమని చెప్తూ వుంటారు ....

కానీ ఆయుర్వేదంలో వేదసంహితల కాలం నుంచి వాడుకలో వున్న ఒక ప్రత్యేక చికిత్సా విధానం ద్వారా మూసుకుని పోయిన ట్యూబులు ఓపెన్ అవుతాయి ....

అంతేకాకుండా కృత్రిమ గర్భధారణ పద్ధతులు అవసరం లేకుండానే ...సహజంగానే గర్భం దాల్చే అవకాశాన్ని కూడా పొందవచ్చు ......

శాస్త్రీయంగా నిరూపణ కాబడ్డ ఆ ప్రత్యేక చికిత్సా విధానం ద్వారా ఎంతో మంది స్త్రీలు సత్ఫలితాలు పొందుతున్నారు......

 #అమ్మ అనే కమ్మటి పిలుపు కలగా మిగిలి పోకూడదు ....పిల్లలు పుట్టకపోవడం అన్న సమస్య చాలా మంది మహిళలను బాధిస్తూ ఉంటుంది.అమ్మ ...
19/04/2018

#అమ్మ అనే కమ్మటి పిలుపు కలగా మిగిలి పోకూడదు ....

పిల్లలు పుట్టకపోవడం అన్న సమస్య చాలా మంది మహిళలను బాధిస్తూ ఉంటుంది.అమ్మ అనే పిలుపు కోసం వారి మనసు పరితపిస్తుంది.
సంతానం కలగకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. రుతువు, క్షేత్రం, అంబు, బీజం,త్రిదోషాల వంటి ఎన్నో అంశాలను ఆయుర్వేదం పరిగణనలోకి తీసుకుంటుంది.
ఈ వైద్య ప్రక్రియలో సంతానలేమిని పరీశీలించాల్సిన దృక్కోణం,ఆ సమస్యకు లభ్యమయ్యే చికిత్సలతో నేను రాసిన #మాతృత్వానికి_ఆయుర్వేదం అనే
పుస్తకంలో సవివరంగా రాసాను...
రీసెంట్ గానే బుక్ రిలీజ్ చేసాను....😊

©డా. యశోద పెనుబాల
ప్రసూతి&స్త్రీల వైద్య నిపుణులు
&అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ -AYU

మొదటి సారి వచ్చిన గర్భాన్ని తీసేయడం అంత మంచిది కాదుఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ప్రెసియస్.అంతే గాక హేల్తీ బేబీ పుట్టే అవకాశాల...
18/04/2018

మొదటి సారి వచ్చిన గర్భాన్ని
తీసేయడం అంత మంచిది కాదు
ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ప్రెసియస్.అంతే గాక హేల్తీ బేబీ పుట్టే అవకాశాలు కూడా ఎక్కువే. కానీ చాలా మంది
స్వతహాగా వచ్చిన గర్భాన్ని వివిధ కారణాల వల్ల తీయించుకోవడానికి ట్రై చేస్తుంటారు....
అదంత మంచిది కాదు....
ఎందుకంటే అబార్షన్ వల్ల గానీ. అబార్షన్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల గానీ..... ట్యూబ్స్ మూసుకుని పోయే అవకాశం ఎక్కువ గా ఉంటుంది...
ఈ మధ్య నేను రిసీవ్ చేసుకున్న కాల్స్ లో ఎక్కువ కాల్స్
#ట్యూబల్ బ్లాక్ (గర్భ నాళాలు మూసుకుని పోవడవం) సమస్య ఉన్న పేషేంట్స్ నుంచి రావడం గమనార్హం...

పెళ్లి అయ్యాక మొదటినెలల్లో స్వతహాగా వచ్చే గర్భం ఒక వరం లాంటిదే... దాన్ని దూరం చేసుకుంటే తర్వాత మళ్ళీ పిల్లలు కనడానికి హాస్పిటల్స్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాల్సి ఉంటుంది.....
గమనించుకోగలరు....
ట్యూబల్ బ్లాక్ పేషేంట్స్ కు (టెస్ట్ ట్యూబ్ బేబీ) కి వెళుతున్నా...ఫలితం పొందలేక పోతున్నారు....

అందుకే తొందరపడి మొదటి గర్భాన్ని తీయించుకోకూడదు.తల్లి బిడ్డకి ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప...

Address

Opp/HDFC Bank, Srinagar Colony Main Road
Hyderabad

Telephone

9052250341

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Yashoda Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category