10/06/2026
చర్మ సమస్యలతో (Skin Issues) బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా, ఎన్ని క్రీములు రాసినా తగ్గడం లేదా? అయితే మీరు తెలియకుండానే ఈ 5 తప్పులు చేస్తున్నారేమో చూడండి.
1. ప్రతీ రోగి చేసే మొదటి తప్పు ఏ చర్మ సమస్య వచ్చిన మొదట చేసే తప్పు, స్వీయ వైద్యం (Self-మెడికేషన్). డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాపులో దొరికే స్టెరాయిడ్ క్రీములు వాడటం. ఇవి తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా, మీ చర్మాన్ని శాశ్వతంగా పాడు చేస్తాయి. అలా కాకుండా అశ్రద్ధ చేయకుండా వెంటనే ఒక మంచి డాక్టరుని సంప్రదించండి.
2. మందులను మధ్యలోనే ఆపేయడం: సమస్య కొంచెం తగ్గగానే డాక్టర్ చెప్పిన కోర్సు పూర్తి చేయకుండానే మందులు ఆపేస్తున్నారు. ఇది సమస్య మళ్ళీ తిరగబెట్టడానికి ప్రధాన కారణం!
చాలా వరకు చర్మ రోగాలు వచ్చిన వెంటనే మందులతో తగ్గవు, అవి పూర్తిగా తగ్గడానికి కొంత సమయం తీసుకుంటాయి. అప్పటి వరకు డాక్టర్ సలహా మేరకు మందులు క్రమం తప్పకుండా వాడాలి.
3. ఆహార నియమాలు పట్టించుకోకపోవడం: కేవలం మందుల మీదనే ఆధారపడి, జంక్ ఫుడ్, నూనె పదార్థాలను తగ్గించకపోతే సమస్య తగ్గడం కష్టం. చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం ముఖ్యం.
4. ఇంటర్నెట్ ప్రయోగాలు: సోషల్ మీడియాలో ఎవరో చెప్పారని తెలియని ఫేస్ ప్యాక్‌లు, హోమ్ రెమెడీస్ వాడటం. ప్రతి ఒక్కరి స్కిన్ టైప్ వేరు, కాబట్టి జాగ్రత్త!
5. గుర్తుంచుకోండి: చర్మ చికిత్సలో 'సహనం' చాలా ముఖ్యం. డాక్టర్ సలహాలను క్రమశిక్షణతో పాటిస్తేనే ఫలితం ఉంటుంది.
ఏదైనా మార్పు కనిపించినా లేదా అనుమానం వచ్చినా వెంటనే మీ చర్మ వైద్యుడిని (Dermatologist) సంప్రదించండి.
మీకు ఈ సమాచారం ఉపయోగపడితే, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి! 🩺✨