Hari Raghav

Hari Raghav Existential Psychologist

Limited copies are available. Those interested in purchasing the book are kindly requested to send ₹500 along with their...
17/03/2026

Limited copies are available. Those interested in purchasing the book are kindly requested to send ₹500 along with their complete postal address (including full name, PIN code, and phone number).

'హరి రాఘవ్ గారు అన్నీ విడ్డూరంగా చెబుతారు. పుట్టిన పసి పిల్లను వదిలి వెళ్తున్నామంటే మేమేమైనా ఎంజాయ్ చెయ్యడానికి వెళ్తున్...
09/12/2025

'హరి రాఘవ్ గారు అన్నీ విడ్డూరంగా చెబుతారు. పుట్టిన పసి పిల్లను వదిలి వెళ్తున్నామంటే మేమేమైనా ఎంజాయ్ చెయ్యడానికి వెళ్తున్నామా? ఉద్యోగానికే కదా..! కష్టపడకుండా డబ్బు వస్తుందా అలా కష్టపడితేనే కదా ఆ పాప భవిష్యత్తు కోసం 50 లక్షలు పోగేసింది. ఆ డబ్బే లేకపోతే ఈ రోజున పిల్లల ఫీజులు ఎవరు కట్టే వారు? డబ్బులు లేకుండా ఎలా జీవిస్తారు? కనీసం ఆయన కౌన్సిలింగ్ డబ్బులు లేకుండా ఇస్తాడా??'

పురిటిలోనే బిడ్డను వదిలి సంపాదన కోసం పరుగులు పెట్టిన ఒక తల్లి మాటలవి. పోనీ ఆవిడ భర్తకు సంపాదన లేదా అంటే అది కూడా కాదు. ఆయన ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కన్న ఒక్కగానొక్క బిడ్డను పనివాళ్లకు వదిలి డబ్బు సంపాదన కోసం వెళ్లిన ఆవిడ ప్రస్తుతం బిడ్డ మానసిక సమస్యలో ఇరుక్కోడానికి ఏమాత్రం బాధ్యత వహించక పోగా ఆ బిడ్డ మీద రోజు రోజుకీ ఒత్తిడి పెంచుతూ ఉంటుంది.

పుట్టిన బిడ్డకు బయోలాజికల్ మదర్ ప్రాముఖ్యత తెలియక మన దేశంలో అధిక శాతం తల్లులు చేస్తున్న పొరపాట్లు ఇవి. ఇంతో కష్టపడి బిడ్డకోసం పోగేసిన డబ్బు వృధాగా పోతుందనే భయం ఒకవైపు, బిడ్డ మానసిక స్థితి ఒకవైపు ఒత్తిడికి గురిచేయడంతో ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని తిరిగి ఆ బిడ్డ మీదే చూపించడంతో ఆ బిడ్డ మరింత బాధ పడుతుంది.

ఇటువంటి వాటిని డీల్ చెయ్యడానికి తల్లిందండ్రులకు సరయిన అవగాహన అవసరం. డిసెంబర్ 29, 2025 సోమవారం నుండి ప్రారంభమయ్యే #పేరెంటింగ్ ప్రోగ్రాం గత ప్రోగ్రాంల లాగానే వారానికి 5 రోజులు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు 20 రోజులు కొనసాగుతుంది.

ఇది పూర్తిగా ఆన్లైన్ ప్రోగ్రాం. శని, ఆదివారాలతో పాటు నేషనల్ హాలీడేస్ నాడు సెలవు ఉంటుంది. ఈ ప్రోగ్రాం 20 రోజులు, 40 గంటల కొరకు డిజైన్ చేయబడినది. ఎవరయినా ఇతర కారణాల వలన ఏదయినా సెషన్ హాజరు కాలేక పోతే మరోసారి ఈ ప్రోగ్రాం నడుస్తున్నపుడు వారికి ఆ సెషన్స్ వరకు అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. ఇతర వివరాలకు 9246165165 నెంబర్ కు వాట్సాప్ చెయ్యడం ద్వారా తెలుసుకోవచ్చు.

09.12.2025

ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న   at   సెప్టెంబర్ 14, 2025న చైర్మన్స్ రిసార్ట్స్, బెంగళూరులో నిర్వహించనున్నారు. 'హరి రాఘవ్ ...
17/08/2025

ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న at సెప్టెంబర్ 14, 2025న చైర్మన్స్ రిసార్ట్స్, బెంగళూరులో నిర్వహించనున్నారు. 'హరి రాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షలిజం' వారు ఈ ప్రోగ్రాంను ఆర్గనైజ్ చెయ్యనున్నారు.

ఈ ప్రోగ్రామ్ ఉదయం 9.30కి మొదలయి సాయంత్రం 4.00 వరకు కొనసాగుతుంది. 9.30 నుండి 12.30 వరకు మొదటి మూడు గంటలు క్లయింట్స్ తమ అనుభవాలను పార్టిసిపెంట్స్ తో పంచుకుంటారు. 12.30 నుండి 1.30 వరకు లంచ్ బ్రేక్ 1.30 నుండి 4 గంటల వరకు లో భాగంగా పార్టిసిపెంట్లు అడిగిన ప్రశ్నలకు ప్రముఖ ఎగ్జిస్టెన్షల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో సమాధానాలు ఇవ్వబడతాయి. పార్టిసిపెంట్లకు లంచ్ మరియూ టీ సప్లయ్ చెయ్యబడుతుంది.

ఎంతో విజ్ఞాన దాయకమైన ఈ ప్రోగ్రామ్ ను పార్టిసిపెంట్లు అందరూ సద్వినియోగ పర్చుకోవాలని మనవి. ఈ ప్రోగ్రామ్ ఖర్చులకు గాను ఒక్కరికి ఫీ రూ.1200/-గా నిర్ణయించడం జరిగింది. ఇతర వివరాల కోసం Sunanda Bulusu గారిని 80195 75422 నంబరుకు వాట్సాప్ చెయ్యడం ద్వారా తెలుసుకోవచ్చు.

17.08.2025

ప్రతీ రోజు మధ్యాహ్నం 3:30 నుండి 4:00 గంటల వరకు స్క్వేర్ టాక్స్ ఛానల్‌లో   లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆనాటి ...
12/04/2025

ప్రతీ రోజు మధ్యాహ్నం 3:30 నుండి 4:00 గంటల వరకు స్క్వేర్ టాక్స్ ఛానల్‌లో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆనాటి ముఖ్య అంశాలపై విశ్లేషణ ఇవ్వబడుతుంది తరువాత కాలర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడతాయి. ప్రశ్నలు అడగాలనుకునే వారు 9246 165 165 నంబర్‌కు 3:40 నుండి నేరుగా కాల్ చేసి అడగవచ్చు.

గతంలో వాట్సాప్ కాల్స్ మాత్రమే స్వీకరించేవారు. అయితే, అందులో ఉన్న సమస్యల కారణంగా కాలర్ల అభ్యర్థన మేరకు ఇప్పుడు డైరెక్ట్ కాల్స్ స్వీకరించడం జరుగుతుంది. సమయం తక్కువగా ఉండటం మరియు ఎక్కువ కాల్స్ వస్తుండటం వలన, ప్రశ్నలు అడగాలనుకునే వారు నమస్తే, గుడ్ ఈవెనింగ్ వంటి సంభాషణలు లేకుండా నేరుగా మరియు క్లుప్తంగా తమ ప్రశ్నను అడగవలసినదిగా కోరడమైనది. ఇబ్బంది లేనివారు తమ వివరాలను కూడా క్లుప్తంగా తెలియజేసినట్లయితే సమాధానాలు ఇవ్వడానికి సులభం అవుతుంది.

https://youtube.com/live/W3KEaIlZBKI

12.04.2025

Address

Hyderabad
500029

Opening Hours

Tuesday 10am - 2pm
Wednesday 10am - 2pm
Thursday 10am - 2pm
Friday 10am - 2pm
Saturday 10am - 2pm

Telephone

+919246165165

Alerts

Be the first to know and let us send you an email when Hari Raghav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Hari Raghav:

Share

Category