04/04/2023
చెవిలోని గువిలి ,జీవిలి ,గులిమి..! చెవిలోని లేని కరిమి లేముల కొలిమి ..!
చెవిలోని అడ్డుపడే తకధిమి తకధిమి...!
చెవిలోని నొప్పి నీపై విరుచుకుపడే ఉరిమి ఉరిమి...!
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చెవిలోని ఈ గువిలి గులిమి లోపల తయారైనటువంటి దాన్నిమనం ఎంత తొందరగా తొలగించుకోగలిగితే అంత మంచిది .
దాని గురించి ఇవాల్టి మన డాక్టర్ స్మెల్ బెల్ వెర్బల్ చెవి ముక్కు గొంతు సర్జన్ గుళిక
ఈ చెవిలోని గువిలినే వ్యాక్స్ లేదా "సెరుమెన్" అనే పదజాలంతో పిలవడం జరుగుతూ ఉంటుంది బాహ్య చెవిలో ఉండేటువంటి మృదులాస్తి మీద ఉన్నటువంటి చర్మం మీద ఉన్న వెంట్రుకల కుదుళ్ళు దాని నుండి వచ్చేటువంటి సెబేషియస్ మరియు సెరోమినస్ గ్రంధుల శ్రావలు ఇవన్నీ కలగలిపి మనకి చెవిలోని గువిలిలాగా తయారవుతూ ఉంటాయి.
సెబేషియస్ గ్రంధులలో స్రవంచే ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఈ సెరోమినస్ గ్రంధుల్లో తయారయ్యే లిపిడ్లు మరియు పిగ్మెంట్ గ్లాండ్లు , కుబుసం లాగా విడవబడినటువంటి ఎపితీలియా కణజాలం అంటే బాహ్య చెవిలో ఉన్నటువంటి చర్మానికి సంబంధించిన కణజాలము, దానితోపాటుగా కెరాటిను ఇవన్నీ మన కర్ణ పట్టలం మీద ఉన్నటువంటి కణజాలంతో కలిసి చెవి యొక్క బయటి భాగం అంటే చెవిలోని ఎక్స్టర్నల్ ఆడిడరి కెనాల్ (మనకి ఉపయోగపడే వాహకం ), దాని లోపల పూర్తిగా నిండిపోవడం మరియు చెవి యొక్క ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ ఈ తయారైనటువంటి గువిలి బయటికి వెళ్లిపోవడానికి అనుకూలంగా లేకపోవడం అంటే ఇది జన్యుపరంగా కావచ్చు లేకపోతే ఎముక యొక్క అస్థిత్వం వల్ల కావచ్చు అక్కడే పేరుకుపోవడం వలన దాని లోపల తేమ చేరటం మరియు ఆ విధంగా అడ్డుపడడం, వల్ల వచ్చేటువంటి నెప్పే కానివ్వండి లేకపోతే బాధే కానివ్వండి, వినికిడి లోపమే కానివ్వండి ఇవన్నీ చెవి ముక్కు గొంతు వైద్యుడి దగ్గరికి మనం వెళ్లేలా చేస్తాయి.
ఇది చిన్న విషయం కింద మనం తీసుకోకూడదు ఎందుకంటే ఒకవేళ బయట చెవి వ్యాక్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కి గురైతే దానిని ఓటైటిస్ ఎక్స్టర్న అంటుంటాము. దాని వల్ల నొప్పి ,బాధ, వినికిడి లోపంతో పాటుగా ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎముకకి సోకే అవకాశాలు, అన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్కు (చిక్కులు)దారి తీసే అవకాశాలుంటాయి .ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే గనక చెవి ముక్కు గొంతు సజ్జన్ ని కలవడం ఉత్తమం.
మీ చెవి ముక్కు గొంతు భవదీయుడు
డాక్టర్ స్మైల్ బెల్ వెర్బల్ ఇ.ఎన్.టి సర్జన్ హైదరాబాద్