Sanatana Online Ayurvedic Clinic

Sanatana Online Ayurvedic Clinic Treatment available for all chronic diseases like Psoriasis, Arthritis, Digestive Problems, Migraine

అజీర్ణము - ఆకలి లేకపోవుటచాలామంది పిల్లలలోను, పెద్దవారిలోను ఆకలి లేకపోవడము, అన్నహితవు లేకపోవడము, కొద్దిగా తిన్ననూ అరగకపోవ...
19/11/2014

అజీర్ణము - ఆకలి లేకపోవుట
చాలామంది పిల్లలలోను, పెద్దవారిలోను ఆకలి లేకపోవడము, అన్నహితవు లేకపోవడము, కొద్దిగా తిన్ననూ అరగకపోవడము గమనిస్తూవుంటాము. అలా బాధపడేవారు రోజూ ఉదయము, రాత్రి భోజనంలో మొదటిముద్దలో (చిన్న పిల్లలకు 2-3 గ్రాములు, పెద్దవారు 5-7గ్రాములు) భాస్కరలవణచూర్ణము కలుపుకొని కొద్దిగా కరిగించిన నేయి వేసికొని తిన్నచో మంచి ఆకలిపుట్టి, అన్నహితవుకలిగి, తిన్న ఆహారము చక్కగా జీర్ణము అవుతుంది. ఇలా ఎంతకాలము వాడిననూ పరవాలేదు. అలవాటు అయిపోవడము ఉండదు. అలా వాడడమువల్ల జీర్ణశక్తి పెరిగి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
వైద్య సలహాలకోసం మా మెయిల్ కు వ్రాయండి: e-mail: [email protected]

ఇంగువసాధారణముగా ఇంగువ వంటలలో సువాసన, రుచి కొరకు వాడుతుంటారు. కానీ ఈ ఇంగువ వలన అనేక లాభములు కలవు. మూల వ్యాధులలో రక్తముపడు...
02/11/2014

ఇంగువ
సాధారణముగా ఇంగువ వంటలలో సువాసన, రుచి కొరకు వాడుతుంటారు. కానీ ఈ ఇంగువ వలన అనేక లాభములు కలవు. మూల వ్యాధులలో రక్తముపడుటను అరికట్టును, ప్రసవానంతరము స్త్రీల పిండోత్పత్తి స్థానమునకు మేలుచేయును. ఆగి ఆగి వచ్చు కడుపునొప్పి, అజేర్ణపు కడుపునొప్పి, అజీర్ణమువల్ల వచ్చిన అగ్నిమాంధ్యము, చిన్నపిల్లలలో వచ్చెడి ఉక్కిసదగ్గు, పెద్దలలో వచ్చెడి వగర్పుదగ్గు, ఉబ్బసము, కడుపులోని ఏలికపాములను పోగొట్టును. ఇంగువను వాడుముందు దానిని ఇనుపగరిటె వేడిచేసి అందులో ఇంగువవేసిన అది పొంగును. అలా పొంగించిన ఇంగువను పై వ్యాధులలో ఉపయోగించనగును. మూలవ్యాధిలోను, బాలెంతలకు వాడునప్పుడు చిటికెడు పొంగించిన ఇంగువ మంచినీళ్ళతోను, అజీర్ణము, అగ్నిమాంధ్యము, కడుపునొప్పిలకు వేడినీటితోను, చిన్నపిల్లల ఉక్కిసదగ్గు, పెద్దవారిలో వచ్చెడు వగర్పుదగ్గు, ఉబ్బసములకు తేనెతోను వాడిన గుణమునిచ్చును. చిన్నపిల్లలకు పెద్దవారికి ఇచ్చెడి మోతాదులో సగము ఈయవలెను.
వైద్య సలహాల కొరకు మా మెయిల్ కు వ్రాయండి [email protected]

బియ్యపు కడుగుచాలామంది ఇళ్ళలో బియ్యము కడిగిన నీటిని వృధాగా పారబోస్తారు. కానీ ఈ నీటివలన ఎన్నో ప్రయోజనములు కలవు. నేటి కాలము...
01/11/2014

బియ్యపు కడుగు
చాలామంది ఇళ్ళలో బియ్యము కడిగిన నీటిని వృధాగా పారబోస్తారు. కానీ ఈ నీటివలన ఎన్నో ప్రయోజనములు కలవు. నేటి కాలములో బియ్యము నిలువయుండుటకు అనేక మందులను కలుపుచున్నారు. కావున బియ్యమును ముందుగాకడిగిన నీటిని పారవైచి, రెండవసారి నీరుపోసి కొంతసేపు నాననిచ్చి బాగుగా పిసికి కడిగిన నీటిని తగుమోతాదులో సేవించినచో మూత్రము ఆగిఆగి వచ్చుట, మూత్రములో మంట, అత్యుష్ణము తగ్గించును. ముఖ్యముగా స్త్రీలలో వచ్చు ఋతుసంబంధమైన శ్వేతప్రదరము(తెల్లబట్ట), రక్తప్రదరము (ఎర్రబట్ట) లను తగ్గించుటలో చాలాఉపయోగకరముగా పనిచేయును. మోతాదు: 20 మి.లీ. నుండి 40 మి.లీ. కడుగునీటిలో కొంచెము చక్కెర కలిపి ఉదయము, సాయంత్రము భోజనమునకు అరగంత ముందు సేవించుచుండిన పైన చెప్పబడిన రోగములను హరించును. ముఖ్యముగా స్త్రీలు ప్రతినిత్యము 10 నుండి 20 మి.లీ. కడుగునీటిని సేవించుచుండిన చాలా మంచిది. బియ్యము కడిగిన 20-30 నిముషములలోపుననే ఈ నీటిని సేవించ వలెను, ఆతరువాత సేవించిన దానివలన ఉపయోగము యుండదు. మిల్లుపట్టిన బియ్యముకన్నా, దంపుడుబియ్యము కడిగిన నీరు మరింత గుణకరముగా యుండును.
Any clinical assistance write to [email protected]
వైద్య సలహాల కొరకు మా మెయిల్ కు వ్రాయండి [email protected]

మూత్రాశయ, పిత్తాశయములలో రాళ్ళు కరుగుటకు KIDNEY AND GAL STONESచాలామందిలో సరియైన ఆహారపు అలవాట్లులేక, సరియైన శారీరక శ్రమలేక...
29/10/2014

మూత్రాశయ, పిత్తాశయములలో రాళ్ళు కరుగుటకు KIDNEY AND GAL STONES
చాలామందిలో సరియైన ఆహారపు అలవాట్లులేక, సరియైన శారీరక శ్రమలేక మూత్రాశయములోను, పిత్తాశయములోను రాళ్ళు ఏర్పడుతూవుంటాయి. అలా ఏర్పడిన రాళ్ళవలన అనేక ఇబ్బందులు పడుతూవుంటారు. అటువంటి పరిస్థితులలో కొండపిండి సమూలము (వేరునుంచి మొత్తము మొక్క) నీడను ఎండించి దానిని చూర్ణముగాచేచుకొని రోజూ ఉదయ సాయంత్రములందు 5 నుండి 10 గ్రాముల చూర్ణమును గోరువెచ్చని నీటితో సేవించిన క్రమముగా రాళ్ళు కరిగి బాధలు ఉపశమించును. ఈ వ్యాధితో బాధపడువారు కొంతకాలము పాలకూర, పాలు, క్యాబేజి, టమోటా వాడకుండుట మంచిది. తేలికయిన ఆహారము, కొద్దిపాటి వ్యాయామము చేస్తూ మంచినీరు ఎక్కువగా తాగుచుంచిన గుణము త్వరితముగానుండును.
When people suffering from Kidney and Gal stones, take the fine powder of Pashanabedhi plant twice a day with warm water (dose 5 to 10 grams). For better results use it for a long time. while using this medicine avoid Spinach, Milk, Cabbage, Tomato. Take light food and do light exercises for better results. Drink plenty of water.
Any clinical assistance write to [email protected]
వైద్య సలహాల కొరకు మా మెయిల్ కు వ్రాయండి [email protected]

నోటిపూతకు మందు MOUTH ULCERSచాలామంది తరచుగా నోటిపూతతో బాధపడుతూవుంటారు. అటువంటి వారు ఈ మందులు వాడిన మంచి ఫలితము కలుగును. జ...
28/10/2014

నోటిపూతకు మందు MOUTH ULCERS
చాలామంది తరచుగా నోటిపూతతో బాధపడుతూవుంటారు. అటువంటి వారు ఈ మందులు వాడిన మంచి ఫలితము కలుగును. జాజికాయ చూర్ణమును వెన్నలోకలిపి రోజు మొత్తములో 4-5సార్లు రాయుచుండిన పుండుమాని ఆహారము తీసికొనుటకు వీలగును. తరచు నోటిపూతతో బాధపడువారు మాదీఫలరసాయనము పరగడుపున, సాయంత్రమందు 10 మి.లీ. చొప్పున వాడుతూ జీర్ణశక్తి పెంపొందించే ఔషధములు కొంతకాలము వాడుట మంచిది.
If you are suffering from MOUTH ULCERS frequently, use the following medicines for better results. Take some powder of Jatiphal and mix it with butter and apply 4-5 times a day. Meanwhile take Madiphalarasayanam 10 ml. twice a day with empty stomach and use some digestive medicines for a period of not less than 30 days.

మధుమేహము DIABETESమధుమేహవ్యాధిగ్రస్తులు ఈ క్రింద తెలిపిన మూలికల చూర్ణమును కలిపి నిలువయుంచుకొని రోజుకు 5 నుంచి 10 గ్రాముల ...
28/10/2014

మధుమేహము DIABETES
మధుమేహవ్యాధిగ్రస్తులు ఈ క్రింద తెలిపిన మూలికల చూర్ణమును కలిపి నిలువయుంచుకొని రోజుకు 5 నుంచి 10 గ్రాముల చూర్ణమును ఉదయ, సాయంత్రములందు కాళీకడుపుతో సేవించుచుండిన మధుమేహము (షుగరు వ్యాధి) అదుపులో ఉంటుంది. అంతేగాక మధుమేహమువలన వచ్చే ఇతర వ్యాధులు రాకుండాకూడా కాపాడుతుంది.
పొడపత్రి ఆకు 100 గ్రాములు, పెన్నెరు 100 గ్రా. మెంతులు 50 గ్రా. నేరేడు గింజల చూర్ణము 75 గ్రా. అతిమధురము 50 గ్రా. త్రిఫల చూర్ణము 50 గ్రా. త్రికటు చూర్ణము 50 గ్రా.
Take fine powders of the following herbs, mix them and preserve in a glass bottle. Take the powder (5 to 10 grams) twice a day 30 minutes before food with water. It controls Diabetes and also protect from side effects of Diabetes.
Gudmar 100 gr., Aswagandha 100 gr. Apricot seeds 50 gr. Jamun seeds 75 gr. Yastimadhu 50 gr. Triphala 50 gr. Trikatu 50 gr.

09/10/2014

త్రిఫల చూర్ణము TRIPHALA POWDER
ప్రతినిత్యము పరగడుపున 5 నుండి 10 గ్రాముల త్రిఫలచూర్ణము తేనె లేక పంచదారతో సేవించుచుండిన మంచి జీర్ణశక్తి, ఆరోగ్యము ఇచ్చును. జబ్బుపడకుండ కాపాడును.
To get good digestive power and good health, take 5 to 10 grams Triphala Churna with honey or sugar daily with empty stomach. It improves immunity power.

09/10/2014

వాము AJWAIN (Carum Copticum)
ప్రతిదినము పరగడుపుననే సికింజిబీను లేదా మాదీఫలరసాయనముతో కలిపి 2 నుండి 3 గ్రాముల వాము తినుచుండిన గురదాలలోను(మూత్రపిండములు), మూత్రపుసంచిలోను పుట్టెడు రాళ్ళు కరిగి బయటకు వచ్చును.
Take 2 to 3 grams Ajwain with empty stomach (early in the morning) along with Sikinjibeen or Madiphalarasayanam. It helps to remove stones in Kidneys and urinary bladder.

09/10/2014

మీ ఆరోగ్య సమస్య ఏదయినా మాకు మెసేజ్ చేయండి, తగిన సలహాపొందండి. మీసమస్యపై మేము అడిగే ప్రశ్నలకు సమాధానములు వ్రాసినచో మీకు తగిన సూచనలు చేస్తాము. ఈ అవకాశమును వినియోగించుకోండి.మీ వివరాలు మా ఈ-మెయిల్ కు వ్రాయండి.
e-mail: [email protected]

అజీర్ణము, ఆమ్లపిత్తమునకు Indigestion, Acidityకడుపులో మంట, పుల్లనిత్రేన్పులు, కడుపు బరువుగావుండుట, వాసనతోకూడిన అపానవాయువు...
08/10/2014

అజీర్ణము, ఆమ్లపిత్తమునకు Indigestion, Acidity
కడుపులో మంట, పుల్లనిత్రేన్పులు, కడుపు బరువుగావుండుట, వాసనతోకూడిన అపానవాయువులు, నోరు దుర్వాసన మొదలగు అజీర్ణ-ఆమ్లపిత్త లక్షణములలో పిప్పలి చూర్ణమును తేనెతో కలిపి తీసికొనుచున్నచో ఆ లక్షణములు తగ్గి జీర్ణశక్తి వృద్ధి అగును. ఈ ఔషధమును కనీసము 40 రోజులు ఉదయ సాయంత్రములు వాడిన చక్కని గుణముకలుగును.
Problems like burning sensation in abdomen, heaviness, gas, bad smell in mouth etc. Take little quantity of Long pepper powder, mix with honey eat it for two times a day. It improves digestive capacity. For better results, use the same for a period of not less than 40 days.

చర్మ రోగములకు పైపూత మందు External application for skin diseasesగజ్జి, తామర, గజకుష్టము(సోరియాసిస్), చుండ్రు మొదలగు చర్మరో...
08/10/2014

చర్మ రోగములకు పైపూత మందు External application for skin diseases
గజ్జి, తామర, గజకుష్టము(సోరియాసిస్), చుండ్రు మొదలగు చర్మరోగములయందు జీడిమామిడి గింజల పైతొక్కలు కాల్చి ఆ మసిని కొబ్బరినూనెలో కలిపి పైనపూయుచుండిన పైచర్మరోగములు త్వరితగతిన మానును. మంచి గుణమునకై రోజుకు రెండుమార్లు రాయవలెను.
In skin diseases like eczema, ringworm, psoriasis, dandruff etc. take some burnt ash of cashew nut shell; mix with co-conut oil. Apply the mix on effected surface of the above problems. For better result apply it twice a day.

మీ ఆరోగ్య సమస్య ఏదయినా మాకు మెసేజ్ చేయండి, తగిన సలహాపొందండి. మీసమస్యపై మేము అడిగే ప్రశ్నలకు సమాధానములు వ్రాసినచో మీకు తగ...
07/10/2014

మీ ఆరోగ్య సమస్య ఏదయినా మాకు మెసేజ్ చేయండి, తగిన సలహాపొందండి. మీసమస్యపై మేము అడిగే ప్రశ్నలకు సమాధానములు వ్రాసినచో మీకు తగిన సూచనలు చేస్తాము. ఈ అవకాశమును వినియోగించుకోండి.మీ వివరాలు మా ఈ-మెయిల్ కు వ్రాయండి.
e-mail: [email protected]

Address

Hyderabad
500090

Telephone

+918977414778

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanatana Online Ayurvedic Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category