10/08/2026
జీవితంలో కొన్ని హోదాలు,
చెమటోడ్చి గెలిచిన గెలుపుల్లోనో,
ఎదురీది చేరిన తీరాల్లోనో వుండవు..
అవి, సున్నితంగా హృదయాలలో
ఆనందంగా జ్ఞాపకాలలో మిగిలిపోతాయి..!
ఆడపిల్ల పుట్టినప్పుడు,
అల్లారు ముద్దుగా మనవళ్లు ఉరికినప్పుడు,
జీవితం తాలూకు అసలైన రుచి తెలుస్తుంటుంది!
తాతగా మా మనవళ్లు ఇచ్చిన ఆ హోదా,
మానవళ్లుగా వాళ్ళు అందించిన ఆ రుచి,
మొన్నీమధ్య
వాళ్ళని సరదాగా ‘The Great Show ‘ సర్కస్ కు తీసుకెళ్లినప్పుడు,
‘Grand Parents Day’ సందర్భంగా,
వారి స్కూలుకి వెళ్ళినప్పుడు కలిగింది..!
కళ్ళ ముందు పెరిగిన బుడతలు,
వాళ్ళకంటూ స్నేహితులని చేసుకొని,
వాళ్ళని మాకు పరిచయం చేస్తూ..
సర్కస్ లో విన్యాసాలని చూసి నివ్వెరబోతూ,
ఆనందంతో వెలిగిపోయిన వారి కళ్ళల్లో
‘ఇంత వయస్సు’ రావడం
బరువు కన్నా మరింత తేలిక అనిపించింది..!
వయస్సు, ఎదో చివరాఖరి గీతకు దెగ్గర చేస్తునట్టు భ్రమ పరిచినా,
మనవళ్లు ఎంతో సునాయాసంగా ఆ గీతని ప్రేమతో చెరుపుతారు..
ఇంకో నిండు జీవితానికి కావాల్సిన ఆయుష్యుని, ఆనందాన్ని
అమాయకంగా అందించి కౌగలించుకుంటారు..
ఆ తృప్తి పరిచిన జ్ఞాపకాన్ని.. మీతో పంచుకుందాం అనీ...