01/07/2021
గౌరి గోపాల్ హాస్పిటల్‌లో స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్
రాయలసీమలో మొట్టమొదటి సారి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వేసుకున్న నగర వాసులు
కర్నూలు నగరంలోని గౌరిగోపాల్ హాస్పిటల్ లో స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోనికి రాగానే కర్నూలు నగరానికి చెందిన సాయి గువంత్ (19 సంవత్సరాలు) మొదటి వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న రెండో వ్యక్తిగా నగరానికి చెందిన ఇర్ఫాన్ బాష (32 సంవత్సరాలు) నిలిచారు. రాయలసీమలో స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఇప్పుడే జరిగింది. దీంతో గౌరి గోపాల్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కిరికీ అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ప్రపంచంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 91.6 శాతం కరోనా వైరస్ పై తన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.