21/10/2021
శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్
ఎలక్ట్రో హోమియో కేర్..
మెయిన్ రోడ్ నకిరేకల్
ఎలక్ట్రో పతి లేదా ఎలక్ట్రో హోమియోపతి వైద్యవిధానం ఒక నూతన 5వ సిస్టం ఆఫ్ మెడిసిన్ మిగతా వైద్య విధానాల మాదిరిగానే ఈ వైద్య విధానంలో మందులతో వైద్యం చేస్తారు. కాకపోతే ఈ వైద్య విధానంలో మొక్కల నుండి అది పూర్తిగా విష రహిత మొక్కల వేరు, బెరడు, పూలు మొదలగు వాటి నుండి ప్రత్యక్షమైన కోహబిషన్ పద్ధతులలో మందులను తయారు చేస్తారు. దానివల్ల మందులు రోగి వాడుతున్నప్పుడు కానీ, వాడిన తర్వాత కానీ ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకపోవడం దీని ప్రత్యేకత. ఈ పద్ధతి వల్ల మొక్కలు ప్రాణశక్తి నష్టపోకుండా మూల ద్రవ రసాలను వెలికి తీయడం జరుగుతుంది. ఎలాంటి కెమికల్స్ విషపదార్థాలు లేకపోవడం వల్ల రియాక్షన్ కు అవకాశం లేదు.
1. ఈ వైద్య విధానంలో మానవుని ఆరోగ్యాన్ని అస్థిర పరచడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని పేర్కొన్నాడు.
2. మానవుని ఆరోగ్యాన్ని ముఖ్యంగా రక్తం, శోషరసము అనే రెండు ద్ర వాలే నిర్దేశిస్తాయని వాటిని సరి చేయడం ద్వారా అనేక రోగాలను నిర్మూలించవచ్చని పేర్కొన్నాడు. అలా నిర్మూలించే క్రమంలో ఉపయోగించే మందుల ద్వారా రోగికి ఎలాంటి నష్టం ఉండకూడదని పూర్తిగా విష రహిత మొక్కలను మందుల తయారీలో వినియోగించాలని సూచించారు. రోగ నిర్ణయం నుంచి మొదలుకొని మందులు తయారయ్యే వరకూ ఒక కొత్త పంథా ద్వారా ఎలక్ట్రో హోమియోపతి వైద్య విధానాన్ని ప్రపంచానికి అందించాడు. మనిషి మిశ్రమ వ్యాధులతో బాధపడుతుంటాడ ని అప్పుడు మిశ్రమ ఔషధ ఉపయోగం సరైనదని భావించి compleses curautur ఈ సిద్ధాంతాన్ని చేశారు.