29/10/2025
వోవర్ బ్లీడింగ్ (అధిక రక్తస్రావము)నకు
# # # # # # # # # # # # # # # # # # # # . రక్తం అంటుకున్న గుడ్డను ఉతికినపుడు మరక పూర్తిగా తొలగింప బడితే ఆరోగ్యకరమని అర్ధము. మిగిలితే ఏదో సమస్య వున్నట్లు లెక్క.
1,రావి ఆకుల కాషాయం త్రాగుతున్న ఏ అవయవమునుండి రక్తస్రావము అయినా తగ్గుతుంది
2,
గరిక. 100gr
అశోక బెరడు చూర్ణం100 gr
కోడిశపాల గింజల చూర్ణం ---100 gr
అతిమధురం 100 gr
బోలచూర్ణము. 50 gr
లక్కచూర్ణము. 50gr
అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి పెట్టుకోవాలి.
ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని పాలలో కలుపుకొని ఉదయం, సాయంత్రం తాగాలి. ఈ విధంగా మూడునెలల పాటు చేస్తే మంచి ఫలితం వుంటుంది. దీనితో పూర్తిగా అధిక ఋతుస్రావం నివారింప బడుతుంది.
అధిక ఋతుస్రావం వలన రక్త హీనత, ఆయాసం, తిమ్మిర్లు, మాటి మాటికి ఇన్ఫెక్షన్ రావడం, జుట్టు ఊడిపోవడం మొదలగు సమస్యలు వస్తాయి.
తీవ్రతను బట్టి రోజుకు మూడు సార్లు ఎనిమిది గంటల తేడాతో ఆహారానికి అరగంట ముందు వాడాలి.
పాల పదార్ధాలను, మాంస పదార్ధాలను,వే డీ చేసేవి వాడకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను వాడాల
రుతుక్రమంలో అస్తవ్యస్థతకు
1,సంస్థాగత మైన కారణం పిత్తదోషం వికృతి చెందటం, ఈ దోష వికృతికి దారితీసే అన్ని పరిస్థితులనూ జాగ్రత్తగా గమనించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
2 కారం, పులుపూ, మసాలాలను తీసుకోకూడదు. శారీరక శ్రమ రెండు పనికిరావు. విశ్రాంతిగా గడపాలి, అయినదానికి, కానిదానికి చిరాకు పడకూడదు; కోపాన్ని తగ్గించుకోవాలి.
3 సమస్య పూర్తిగా తగ్గే వరకు భార్యాభర్తల కలయికను ఆయుర్వేదం నిషేధించింది.
4 బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు మంచాన్ని, కాళ్లవైపు ఎత్తులో ఉంచి పడుకుంటే మంచిది. దిండును (తలగడ) వాడకూదు. తలను కిందకూ కాళ్లను ఎత్తులోనూ ఉంచి ఏటవాలుగా పడుకోవడం వల్ల అథోమార్గంలో రక్తస్రావమవ్వకుండా ఉంటుంది.
5.ఉసిరికాయలను (గింజలను తొలగించి) నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరండి. దీని నుంచి రసం పిండి, ఆరు చెంచాలు మోతాదుగా చక్కరతో కలిపి తీసుకోండి. ఇలా ప్రతిరోజు రెండు పూటలా చేస్తే త్వరలోనే ఫలితం కనిపిస్తుంది. ఒకవేళ రసాన్ని తీయడం కష్టంగా అనిపిస్తే ఉసిరిపొడిని నీళ్లతో కలిపి తీసుకోవచ్చు.
6 తిప్పతీగ ఆకులను దంచి రసాన్ని పిండి ఆరు చెంచాలు మోతాదుగా పటిక బెల్లం (మిశ్రి) పొడితో కలిపి తీసుకుంటే రక్తప్రదరం శ్రవిస్తుంది
7 అడ్డరసం ఆకుల నుంచి స్వరసం తీసి రెండు చెంచాలు మోతాదుగా తీసుకోవాలి. అడ్డరసం రక్తస్రావాన్ని ఆపడంలో పేరెన్నికగన్నది.
8.రేగు, నేల ఉసిరి, శుద్ధిచేసిన లక్క, లొద్దుగ, నాగకేశరాలు, గరిక , అశోక ఇవన్నీ రుతుక్రమాన్ని అదుపు చేస్తాయి. వీటిని వైద్యుడిని సంప్రదించి వాడుకోవచ్చు.
9 రక్తప్రదరానికి ఆయుర్వేదంలో శక్తివంతమైన మందులు ఉన్నాయి. చంద్రప్రభావటి, చంద్రకళారస, అశోకారిష్టం, పుష్యానుగచూర్ణం వంటి ఔషధాలను వాడితే, పిత్తాన్ని సమస్థితిలోకి తెచ్చి రుతుక్రమాన్ని పునర్వ్యవస్థీకరిస్తాయి. వీటిని వైద్య సలహా మేరకు వాడుక