Sanjay Darla Alternative medicine

Sanjay Darla Alternative medicine Get detailed analysis of your present diseases and future diseases to get immediate relief through acupressure, acupuncture and food supplements.

Excellent and experienced support to combat diseases and improve wellness through acupressure, acupuncture and herbal nutrition.

28/02/2024

14/07/2023

ఉప్పు - తప్పు

మీ ఇంట్లో నలుగురు సభ్యులు .

ఒక కిలో ఉప్పు ఎన్ని రోజులకు వస్తుందేంటి ?

✔️మెడికల్ సైన్స్ లెక్క ప్రకారం ఒక మనిషికి రోజుకి 2 .3 గ్రాముల ఉప్పు .
👉అంటే ఒక కిలో ఉప్పు మూడు నెలలు రావాలి . ఇంట్లో ఇద్దరు ఉంటే ఆరు నెలలు రావాలి. కేవలం టేబుల్ పై పెట్టి మీరు మజ్జిగ లేదా పెరుగు అన్నానికి, జామ లేదా మామిడి కాయలు తినేటప్పుడు వాడే ఉప్పు లెక్క కాదు .
వంటింట్లో వివిధ ఆహార పదార్థాలు వండడానికి... దానికి అదనంగా మీరు డైనింగ్ టేబుల్ పై పెట్టుకొని తినేటప్పుడు వాడే ఉప్పు .. ఇలా మొత్తంగా వాడే ఉప్పు లెక్క ఇది .

👉ఇంతకంటే అదనంగా తింటే..
1 . బిపి పెరుగుతుంది .
2 గుండెపోటు ప్రమాదం .
3 అన్నింటికీ మించి అధిక ఉప్పు కీళ్ల సందుల్లోకి వెళ్లి కూర్చొని అక్కడ ఉన్న సైనోవియల్ ద్రవాన్ని తాగేస్తుంది . దీనితో కీళ్ల నొప్పులు . నడుము నొప్పి . కూర్చుంటే లేవలేరు . లేస్తే కూర్చో లేరు .

👉సగటున ఒక మనిషి నేడు తీసుకోవలసిన దానికన్నా ఆరురెట్లు అధిక సోడియం ను శరీరం లోకి పంపిస్తున్నాడు . ఇదొక ఆరోగ్య ఉపద్రవం గా మారింది .

"చదుతున్నామని ఏదో చెబుతారండీ .. అయినా ఉప్పు లేకుండా ఎలా తింటాము ? చప్పిడి కూడు తిని బతికే బతుకూ ఒక బతుకేనా ? అయినా మన తాతముత్తాతలు ఇలా త్రాసు పెట్టుకొని లెక్క పెట్టుకొని తిన్నారా ? హాయిగా మనసుకు ఏది నచ్చితే అది తిన్నారు . గుండ్రాయిలా జీవించారు . అయినా ఎక్కువ రోజులు బతికి ఏమి చేస్తాము ?".. ఇది చాల మంది ఆహార ప్రియుల ఆలోచన .

బ్రతకడానికి తినేవారు కొందరు .. తినడానికి బ్రతికే వాళ్ళు కొందరు . ఆధినిక ప్రపంచం లో ముఖ్యంగా నగరాల్లో సంపద పెరిగే కొద్దీ రెండో కేటగిరీ వారి సంఖ్య పెరుగుతోంది .

ఎన్నాళ్ళు బతికామనేది తరువాతి లెక్క . అధిక బిపి తో .. అధిక బరువుతో కీళ్ల నొప్పులతో.. గుండెకు స్టింట్ లు
వేసుకొంటూ రోజుకు గుప్పెడు మాత్రలు తింటూ బతకడమేనా ? ఆరోగ్యంగా జీవించాలి అనే ఆలోచన వద్దా? కనీసం రాబోయే తరాల వారైనా ఆరోగ్యంగా జీవించాలి అని ఆలోచించక పొతే అది పెద్దరికం అవుతుందా ?

ఉప్పు తగ్గించాలి అంటే ఉప్పు లేని తిండి తినమని కాదు . ఇలా చెయ్యండి .

1 . పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కు .. ఇడ్లీ , దోస , సాంబార్, చట్నీ కి బదులుగా .. మొలకెత్తిన పెసలు , నాన పెట్టిన బాదం , వాల్నట్ , పిస్తా పప్పు , కోడిగుడ్డు తెల్ల సొన తినండి .

2 . ప్రతి పూటా దోసకాయ { కీరా } ఒకటి తినండి . సగం కడుపు దీనితో నిండిపోతుంది . శరీరానికి వెళ్లే ఉప్పు శాతం తగ్గిపోతుంది . ఖీర తో పాటూ క్యాబేజీ లాంటి సలాడ్స్ తీసుకోండి . అధిక బరువు ఉన్నవారు షుగర్ ప్రాబ్లెమ్ ఉన్నవారు బీట్రూట్ క్యారెట్ తీసుకోవద్దు .

౩. జామకాయ మామిడి కాయ లాంటివి తినేటప్పుడు ఉప్పు అవసరం లేదు . పచ్చివిగా తినండి . టేస్ట్ ఎంజాయ్ చెయ్యండి .

4 . మజ్జిగ / పెరుగు అన్నానికి ఉప్పు వేసుకోవడం తప్పనిసరి . లేక పొతే చప్పగా ఉంటుంది అనుకొంటున్నారు కదా ? మూడు రోజులు పాటూ ఉప్పు లేకుండా తినండి . మొదట్లో చప్పగా రుచీపచీ లేనట్లు ఉంటుంది . అన్నాన్ని బాగానమిలి తినండి . వారం తిరిగాక ఉప్పు వేసిన మజ్జిగ / పెరుగన్నం ఎంత చెత్తగా ఉంటుందో . ఇన్నాళ్లు దేన్నీ కోల్పోయారో అర్థం చేసుకొంటారు . జస్ట్ నాలుగు రోజులు ట్రై చెయ్యండి .

5 . తాజా పళ్ళు ఆకు కూరలు కాయగూరలు బాగా తినండి . బియ్యం గోధుమ తో చేసిన ఆహార పదార్తాలు తగ్గించండి . పళ్ళు కాయగూరలు { కాయగూరల్లో దుంప కూరలు కూడదు . ఇవి బియ్యం తో సమానం } ఎంత ఎక్కువ తింటే... అన్నాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది . షుగర్ ఉన్న వారు పళ్ళు తినొచ్చా ? ముందుగా ఒక పాయింట్ చెప్పుకోవాలి . చిన్నపటినుంచి పళ్ళు ఆకుకూరలు కాయగూరలు బాగా తింటే షుగర్ సమస్య రాదు . షుగర్ సమస్య ఉన్నవారు కూడా ఒక పద్ధతిలో పిండిపదార్తలను బాగా తగ్గించి సాయంకాలం పొద్దున్న కొద్దీ పాటీ పళ్ళు ఖాళీ కడుపున తీసుకోవచ్చు . బాగా తియ్యగా వుండే మామిడి ద్రాక్ష లాంటివి కాకుండా జామ కివి లాంటివి షుగర్ వున్నవారికి మంచిది .

✔️ఆహారం లో పైన అయిదు పాయింట్లలో చెప్పిన మార్పులు తెస్తే .. మీ ఒంటి లోనికి వెళ్లే ఉప్పు తగ్గిపోతుంది .
1. రెండు నెలలో బిపి కంట్రోల్ లోకి వచ్చేస్తుంది .
2 . గుండెపదిలం .
3. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి .
పైన చెప్పినవి తక్కువ క్యాలోరీల ఆహారం . దీని వల్ల 4. ఆరునెలల్లో సన్నబడుతారు .
5 షుగర్ సమస్య తగ్గిపోతుంది .
6. పళ్లుకాయగూరల్లో అంటి యాక్సిడెంట్ లు ఉంటాయి .. దీని వల్ల కాన్సర్ నుంచి రక్షణ .
7 . దీనికి తోడు పీచు సమృద్ధిగా ఉంటుంది . దీని వల్ల అజీర్తి అల్సర్ లాంటి సమస్యలు దరిచేరవు . మంచి ఫ్యాట్స్ అంటే ఒమేగా - ౩ ఫాటీ ఆసిడ్స్ శరీరానికి అందుతుంది .
8 దీని వల్ల కొలెస్ట్రొల్ సమస్య పారిపోతుంది .
9. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది .
10 . మెదడు చురుకుగా మారుతుంది .

ఎన్ని ఉపయోగాలో !

మరెందుకిక ఆలస్యం .
నేడే మీ ఆహారం లో పైన చెప్పిన మార్పులు తీసుకొని రండి .

పైన చెప్పిన మార్పులు చేస్తే ఒంట్లోకి వెళ్లే అధిక ఉప్పు వెళ్లకుండా నివారించగలుగుతామా ?

లేదు . నివారించలేము !

షాకింగ్ గా వుంది కదా ?
ఇంకా చదవండి .

ఉప్పు .. అంటే సోడియం క్లోరైడ్ .

శరీరానికి రోజుకు అర్ధ మిల్లి గ్రాము సోడియం చాలు { పైన చెప్పిన రెండు రెండు గ్రాములు ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ లెక్క . ఇప్పుడు చెబుతుంది సోడియం లెక్క } . అసలు విలన్ సోడియం . అధిక మొత్తంలో సోడియం తింటే అనేక సమస్యలు .

నగరజీవుల్లో అధిక సోడియం కు డెబ్భై శాతం కారణం ప్యాకెట్ ల డబ్బాల్లో వచ్చే ఆహార పదార్థాలు . బిస్కెట్ ల.. కేకు లు .. పిజ్జా లు బర్గర్ లు .. పొటాటో చిప్స్ , పాప్ కార్న్ ..రెడీ టు కుక్ ఫుడ్ ప్యాకెట్ లు... వీటిలోదారుణ మొత్తం లో సోడియం ఉంటుంది .
అసలు సమస్య కు ఇవే కారణం .
మీరు వారమంతా ఉప్పు దట్టించిన ఇంట్లో వండిన ఆహార పదార్థాలు బాగా తింటే ఒంట్లోకి ఎంత ఉప్పు చేరుతుందో .. వారం లో ఒక రోజు .. ఇలా ప్యాకెట్ ల లో డబ్బాలో వచ్చే ఫుడ్ తింటే అంత అధిక సోడియం వొంటిలోకి చేరుతుంది .

అదేంటి లెక్క ? ప్యాకెట్ ల దొరికే ఆహార పదార్తాల్లో అంత ఉప్పు ఉంటుందా ? అయితే బాగా ఉప్పగా ఉండాలి గా .. అప్పుడు మనం తినలేము గా అనుకొంటున్నారా ? ఉప్పు కాదండీ.. ఇందులో సోడియం భారీగా ఉంటుంది . 1. ఆహారానికి రుచి రావడానికి 2. ఎక్కువ కాలం నిల్వయుండడానికి 3. కరకరలాడేలా ఉండడానికి వీరు అధిక మొత్తం లో బేకింగ్ సోడా లాంటివి కలుపుతారు . అంటే అధిక సోడియం .

ఇప్పడు అర్దమయ్యిందా ? తాతముత్తాతలు ఎందుకు కడుపు నిండా తినగలిగారో ?

వారిలా ఆరోగ్యంగా ఉండాలంటే ..

ప్యాకెట్ ల వచ్చే ఆహార పదార్థాలు చేసే కీడు గ్రహించండి . వారు సోడియం విషాన్ని కలిపి రుచి పేరుతొ మన ప్రాణాలు తీస్తున్నారని గ్రహించండి . సహజ ఆహార పదార్థాలు .. అంటే గేగులు , తాటినుంజెలు , రేగు పళ్ళు , జామ కాయలు ఇంకా ఆయా కలల్లో దొరికే పళ్ళు ఆకు కూరలు కయ గూరలు బాగా తినండి .

ఆరోగ్యం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు . కడుపునిండా తినొచ్చు . తినాలి .

ఏమి తింటున్నాము అనేది ముఖ్యం .
EAT RIGHT ! LIVE HEALTHY !!

సరైన ఆహరం తీసుకోండి .
ఆరోగ్యంగా .. ఆనందంగా జీవించండి .

వెల్నెస్‌కోచ్ పోషకాహార నిపుణులు.
సుధాబాల.మానేపల్లి
😊🙏🏻

09/05/2023

Address

Anam Vaari Street, Near TDP Office
Nellore
524001

Telephone

8099250729

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjay Darla Alternative medicine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sanjay Darla Alternative medicine:

Shortcuts

Share

Category