03/08/2026
వాకర్స్ ఆరోగ్య సంరక్షణలో భాగంగా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహించే వాకర్స్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా, ఈ ఆదివారం ఒంగోలు మినీ స్టేడియంలో శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ వైద్య శిబిరాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి శ్రీమతి జి. రాజరాజేశ్వరి గారు ప్రారంభించి, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్న శ్రీరామ్ హాస్పిటల్ బృందాన్ని అభినందించారు.
ఈ శిబిరంలో 150 మంది ప్రజలు పాల్గొని సుమారు రూ.7,000 విలువైన పలు ఆధునిక వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా పొందారు. వీటిలో బీపీ, షుగర్, ఈసీజీ, హీమోగ్లోబిన్, ఎముకల సాంద్రత (Bone Mineral Density), ఆధునిక కంటి పరీక్షలు, పాదాల నరాల స్పర్శ పరీక్ష, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్షలు, దంత పరీక్షలు వంటి సేవలు అందించబడ్డాయి.
అనంతరం కరాటే, యోగా సాధన చేస్తున్న 75 మంది విద్యార్థులకు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు, దంత వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు ప్రత్యేక ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లల ఎదుగుదల, సమతుల్య పోషకాహారం, కంటి ఆరోగ్యం, దంత సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ చాపల వంశీ కృష్ణ గారు, ప్రముఖ జనరల్ మెడిసిన్ & డయాబెటాలజీ వైద్య నిపుణులు డాక్టర్ సానల ధీరజ్ బాబు గారు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ పురాణపు మహిత గారు, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ & లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పిన్నక ప్రశాంత్ గారు, చిన్నపిల్లలు మరియు నవజాత శిశువుల వైద్య నిపుణులు డాక్టర్ కలంకుంట్ల గంగా సాగర్ రెడ్డి గారు, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొప్పోలు సౌమిత్ర పల్లవ్ గారు, దంత వైద్య నిపుణులు డాక్టర్ కగ్గా చైతన్య ప్రియ గారు పాల్గొని ప్రజలను పరీక్షించి తగిన వైద్య సూచనలు, సలహాలు అందజేశారు.
ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం, వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తుందని డాక్టర్ చాపల వంశీ కృష్ణ గారు తెలిపారు.
డాక్టర్ చాపల వంశీ కృష్ణ
MS (Ortho), Osmania | M.Ch (Ortho)
సీనియర్ చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
గుంటూరు రోడ్డు, ఒంగోలు.