29/07/2026
*గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులు పొందిన జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి*
*వైద్య సేవలే మహోన్నత గురుసేవ – గురు పౌర్ణమి సందర్భంగా వైద్యులకు ఘన సన్మానం*
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు పాల్గొని శ్రీ షిరిడీ సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు చిర్ల జగ్గిరెడ్డి గారికి వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం గోపాలపురం గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రజలకు విశిష్ట వైద్య సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకున్న డాక్టర్ మండ గంగిరెడ్డి గారు (రికవరీ హాస్పిటల్), డాక్టర్ గంధం రామారావు గారు (రాఘవేంద్ర కంటి హాస్పిటల్)లను గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి చిర్ల జగ్గిరెడ్డి గారు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ, సమాజానికి నిస్వార్థంగా సేవలందించే వైద్యులు నిజమైన సేవామూర్తులని, తమ జ్ఞానం, అనుభవంతో ఎన్నో కుటుంబాల్లో ఆరోగ్యాన్ని, ఆశను నింపుతున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత గొప్పదని కొనియాడారు. గురు పౌర్ణమి రోజున సమాజానికి సేవలందిస్తున్న ఇటువంటి మహనీయులను గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.