17/08/2026
స్విమ్స్, తిరుపతి
తేది : 15.08.2026
స్విమ్స్ లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) 15.08.2026 తేది శనివారం ఉదయం 9.00ని||లకు స్విమ్స్ యూనివర్శిటీ (శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల క్రీడామైదానం నందు ఏర్పాటు చేసిన) 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియచేశారు.
ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ గారు జాతీయ పతాకావిష్కరణ గావించి, డాక్టర్లను, విద్యార్థులను, సిబ్బందిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, స్వాతంత్య్ర సముపార్జనకు ఎందరో మహానుభావులు అశువులనర్పించారని, వారి స్మరించుట మన కనీస కర్తవ్యంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల నిబద్ధతతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తామని డా॥ ఆర్. వి.కుమార్ గారు ప్రతిజ్ఞను చేయించగా, సంస్థ ఉద్యోగులు ప్రతిజ్ఞాపాటవాన్ని ఉచ్చరించడం ద్వారా ప్రతినబూనారు. అదేవిధంగా సంస్థ అభివద్ధిని కాంక్షిస్తూ కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులవతి డా॥ ఆర్.వి.కుమార్ గారు మాట్లాడుతూ... స్విమ్స్ కుటుంబ సభ్యులందరికి ముందుగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతు, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో స్విమ్స్ యూనివర్శిటీ వున్నదని చెప్పుకోవడానికి గర్విస్తున్నామన్నారు. తి.తి.దే. సహకారంతో స్విమ్స్ కు ఇంతకమునుపు 60కోట్ల గ్రాంట్ వుండగా దీనిని ప్రస్తుతం 130 కోట్ల రెవిన్యూ గ్రాంటు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమని, దీనికి తి.తి.దే చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు గారికి, ఇ.ఓ మరియు జె.ఇ.ఓ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్విమ్స్ యస్.ఎ.బి.హెచ్, నర్సింగ్ ఎక్స్ లెన్సీ మరియు ఎన్.ఎ.బి.యల్ కూడా సాధించుకున్నామని, వైద్య సేవలు అందించడమే కాకుండా నాణ్యతమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ గోడౌన్ మరియు పేషెంట్ల సహాయకుల విశ్రాంతి భవనము వినియోగములోకి తీసుకురావడం జరిగిందని, కార్పొరేట్ సెంట్రల్ ఫండ్ తో అత్యాధునికమైన యం.ఆర్.ఐ. పెట్. స్కాన్ ను సమకూర్చుకున్నామని వీటిని ప్రారంభించామని, అలాగే క్యాన్సర్ భవనమును కూడా ఆంధ్రప్రదేశ్ గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. త్వరలో ఆరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు స్విమ్స్ కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, అలాగే ఆంధ్రప్రదేశ్ గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తి.తి.దే వారి ఆదేశాల మేరకు శ్రీవారి వైద్యసేవలను స్విమ్స్ నందు కూడా అమలు చేయడం జరిగిందని, అంతేకాకుండా స్విమ్స్ కు రోజుకు 1400 మంది వరకు వచ్చే పేషెంట్ల సౌకర్యార్ధం స్విమ్స్ విద్యార్ధులచే స్విమ్స్ సేవ విభాగంను ప్రారంభించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్విమ్స్ నందు విశేష ప్రతిభ కనబరచిన ఫ్యాకల్టీ, పి.జి. రెసిడెంట్, యం.బి.బి.ఎస్. ఇంటర్నీస్.. శాశ్వత & అడహాక్ ఉద్యోగులు, టెక్నీషియన్లు, ఫెస్సీ వర్కర్లు, వార్డు బాయ్స్, స్టాఫ్ నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం 81 మందికి గాను 50 మంది శాశ్వత ఉద్యోగులకు, 31 మంది ఒప్పంద ఉద్యోగులకు, సర్టిఫికెట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిల కోసం ఇండోర్ గేమ్స్ కోసం జిమ్ ను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా తి.తి.దే వారి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గ్రౌండ్ నందు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో స్విమ్స్ రిజిస్ట్రార్ డా|| అపర్ణ ఆర్ బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్, డిప్యూటీ డైరెక్టర్ డా॥ ఆది క్రిష్ణయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్ డా|| ఎర్రమరెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి ఇందిరమ్మ. ఇ.సి.జి టెక్నిషియన్ మహాలింగం గార్లకు తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ శ్రీ బి. ఆర్. నాయుడు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డా. యస్. వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి మరియు సీనియర్ గ్రేడ్ ప్రొ॥ డా|| అల్లాడి మోహన్ గారు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ వైద్యులు, వైద్య మరియు వైద్యేతర సిబ్బంది, వివిధ విభాగాధిపతులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
-స్విమ్స్ సోషల్ మీడియా