09/06/2026
ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులు బయటకు చూస్తే బాగానే కనిపిస్తారు. కానీ వాళ్లలో చాలామంది మౌనంగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. పరీక్షల ఒత్తిడి, ఆందోళన, ఏకాగ్రత లోపం, మొబైల్ వ్యసనం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, భావోద్వేగ సమస్యలు, చదువు మీద ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు చాలా సాధారణంగా మారిపోయాయి.
చాలా మంది ఇప్పటికీ కౌన్సిలింగ్ అంటే సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్లకే అనుకుంటారు. కానీ నిజానికి కౌన్సిలింగ్ అనేది బలహీనతక గుర్తు కాదు. ఒక విద్యార్థి తన ఆలోచనలను, భావోద్వేగాలను, జీవితాన్ని సరైన దిశలో నడిపించుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి మార్గం.
ఒక మంచి సైకాలజిస్టు విద్యార్థి మనసును అర్థం చేసుకుని, అతని లేదా ఆమె సమస్యలను వినిపించి, ఒత్తిడి మరియు ఆందోళనలను తగ్గించడంలో సహాయపడతాడు. చదువుపై ఏకాగ్రత పెరగడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తాడు. అలాగే తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య మంచి అవగాహన పెరగడానికి కూడా సహాయపడతాడు.
ఈరోజు ఒక విద్యార్థికి ట్యూషన్ ఎంత అవసరమో, సరైన సమయంలో సరైన కౌన్సిలింగ్ కూడా అంతే అవసరం. మంచి మార్కులు మాత్రమే కాదు, మంచి మానసిక ఆరోగ్యం కూడా విజయానికి చాలా ముఖ్యం.
ఈరోజు ఒత్తిడితో ఉన్న ఒక విద్యార్థి, సరైన కౌన్సిలింగ్ మరియు మార్గదర్శకత్వంతో రేపటి ఆత్మవిశ్వాసంతో కూడిన విజయవంతమైన వ్యక్తిగా ఎదగగలడు.
మంచి భవిష్యత్తు కోసం చదువు ఎంత ముఖ్యమో... మంచి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది.
సైకాలజిస్ట్ & హిప్నోటిస్ట్
డి. కోటేశ్వరరావు
నేహా కౌన్సిలింగ్ అండ్ సైకో థెరపీ సెంటర్
బ్రాంచెస్ : విజయవాడ మరియు నూజివీడు
సెల్ : 093927 10280
Website at
www.nehacounselling.com