Dr Sri Raghu Ram

Dr Sri Raghu Ram వైద్య & సామాజిక సత్యాలు నిర్భయంగా...
ACTIVIST🧑‍🎤
WRITER ✍️by PASSION
DOCTOR👨‍⚕️by PROFESSION
(2)

02/06/2026

ఈ దేశం - నా రాష్ట్రాన్ని పచ్చి మోసం చేసి నేటికి "పుష్కర కాలం"...
ఆ పాపం - ఈ దేశాన్ని తరుమూతూ ఉంది & తరుమూతూ ఉంటది,
ఆంధ్రప్రదేశ్ సర్వోన్నతoగా తిరిగి నిలబడే వరుకూ....

ఈ బుద్ధ పూర్ణిమ నాడు - అమరావతి పట్ల మన బాధ్యతను మళ్లీ గుర్తు చేసుకుంటూ.....
01/05/2026

ఈ బుద్ధ పూర్ణిమ నాడు - అమరావతి పట్ల మన బాధ్యతను మళ్లీ గుర్తు చేసుకుంటూ.....


30/04/2026

మన బెజవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఊపిరి హాస్పిటల్లో -
డెలివరీ వర్కర్స్ కోసం "వేసవి ఆరామం" ఏర్పాటు చేసాం.
11am- 5pm : వేసవి కాలం వరుకూ.
క్రితం వేసవిలో - మన హెల్త్ మాల్ లో చేసాం.

- అన్నా కాంటీన్స్...మధ్యాహ్నం 1.30 తర్వాత కాలిగా ఉంటాయి కాబట్టి.... ఇప్పుడు వేసవిలో & ఆ తర్వాత కూడా.... GIG వlర్కర్స్ కోసం ఉపయోగపడే సౌకర్యం కలిపించావచ్చు.


#18%GSTonDelivery
#55%IncomeOnPetrol

16/04/2026

11/04/2026

ఇది నేను కనిపెట్టిన పద్దతి కాదు. జస్ట్ సుప్రీమ్ కోర్ట్ SIT తన నివేదికలో - ఏ విధమైన కెమికల్స్ / పదార్ధాలు వాడి, ఆ నెయ్యి కానీ విష నూనె ను తయారు చేశారో... అదే విధంగా చేసి చూపించా....
కావాల్సిన ప్రధాన పదార్ధాలు :
1) పామీటిక్ ఆసిడ్ - పామ్ ఆయిల్, బీఫ్ / కొన్ని జంతువుల కొవ్వులో ఉంటది.
నేను తేలికగా దొరికే - పామ్ ఆయిల్ వాడాను.
2) సెంటింగ్ ఫ్లోవర్స్ - నేను సాన్వి వారి "నెయ్యి Flavour " అమెజాన్ లో తెప్పించ్చాను.
3) బీట కారోటినోయిడ్స్ - ఫుడ్ కలర్ & ఎర్ర రంగు ఉన్నా విటమిన్ A టాబ్లెట్స్ వాడాను.
4) ఫుడ్ ఎమల్సిఫయర్ : ఫుడ్ గ్రేడ్ ది అమెజాన్ లో తెప్పించ్చా.

ఇక - జంతువుల కొవ్వు కలిసి ఉండక పోవచ్చు అని అందరం కోరుకుందాం. పంది కొవ్వు, ఫిష్ కొవ్వు అయితే 100% కలవలా....,
కానీ పామిటిక్ ఆసిడ్ ఉండే - బీఫ్ లాంటి కొన్ని కొవ్వులు తక్కువ మోతాడులో కలిసినా తెలిసే అవకాశం తక్కువ & SIT ఆ రకమైన DNA టెస్టులు చెయ్యాలా....

ఈ నూనె లో - 100 % పామిటిక్ ఆసిడ్ ఉన్న కారణంగా.... 100% అది కల్తీ - ఎందుకంటే, స్వచ్ఛమైన నెయ్యాలో అస్సలు ఉండకూడనివి 100% ఉండి ( గీ ఫ్లావర్స్, Emulsifiers, కలరింగ్ బీట కారోతీన్స్ etc etc ఉన్నాయి - 100% నిరూపితమైన్నాయి ), ఖచ్చితంగా ఉండాల్సిన బుట్రిక్ ఆసిడ్ 0% ఉంటే
- 100% అది నెయ్య కానీ కాదు.

03/04/2026

నిన్న పార్లమెంట్ లో..... అమరావతి కి దేశంలోని అన్నీ పార్టీలు - మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇచ్చిన తీరు చూస్తే ----
అమరావతి ఆక్రందన - దేశం మొత్తం విన్నది & ఆంధ్ర ప్రదేశ్ కోసం మేము ఉన్నాం అన్నట్టుగా అనిపించింది .
ఆ మాత్రo దానికి - ఇంత హడావిడి అవసరమా అని మొదట అనిపించినా .... ఎందుకో , ఈ దేశం మన రాష్ట్రనికి పార్లమెంట్ సాక్షిగా తీరని ద్రోహం చేసింది అని పుష్కర కాలంగా మనసులో ఉన్న ఒక కోపం - పోయింది .

జై ఆంధ్ర ప్రదేశ్ - విజయీభవ అమరావతి

సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో - ఢిల్లీ లో... ఇతని  ( అప్పటి కేంద్ర మంత్రి ) నామ ఫలకం పగలుకొట్టిన అప్పటి  మనిషి - నాలో ఇప్...
26/03/2026

సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో - ఢిల్లీ లో... ఇతని ( అప్పటి కేంద్ర మంత్రి ) నామ ఫలకం పగలుకొట్టిన అప్పటి మనిషి - నాలో ఇప్పటికీ అలానె ఉన్నాడు.

ఆ రోజు అయితే - ఇన్నాళ్లు, ఇంత జాగ్రత్తగా ఉన్నా.... హయ్యో! ఇప్పుడు కచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనుకున్నా...., అతను తెలివి కలవాడు కదా.... మీడియా లో రాకుండా చూసి - ఫాస్ట్ గా అతన్ని పంపించ్చెయ్యండి అని అతని అధికారాన్ని నా మీద వాడలా !!!
మొన్న అతను పోయాడు.... అని వార్తకి చూసినప్పుడు - ఎదవ జీవితం , ఈ మాత్రం దానికి - ఆ రోజు గడ్డి తిన్నాడు అనిపించింది. ఎవరు గుర్తు పెటగుకుంటారు అండీ.....ఎదవ పదవులు , అందరం పోవాల్సిన వాళ్ళమే.... ఎక్కువ కాలం బ్రతికితే - క్రుంగి కృషించి. లేదా.... అర్దాంతరంగా....

ఏమిటో - ఒక సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లే, ఒక జైపాల్ రెడ్డి... వీళ్ళ వరసలో - అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ మంత్రులని చూస్తా నేను.
భూమి - వీళ్ళను ఇన్నాళ్లు మొయ్యటమే శాపం అన్నట్టుగా.

రాష్ట్ర విభజన నా మనసుకి చేసిన గాయం - మన రాష్ట్రం మహా గొప్పగా, అమరావతి మహా వైభవంగా అయితే కానీ కాస్త పోదు.

19/03/2026

12/03/2026

ఒక మంచి మాట - అయితే....ఈ ఐశ్వర్యాలు సంపాదించటం మన చేతుల్లో లేదే... అని బాధ మాత్రం పదమాకండి.

24/02/2026

ప్రతి ఒక్కరికి ఈ ఆరాచకాలు తెలిసేలా... షేర్ చేయవలిసిన వీడియో.
VRK రిపోర్ట్స్ లో ఉండే - మోసాలను బహిర్గటం చేశా....
కిడ్నీ పేషెంట్స్ - కచ్చితంగా చూడాలి.
అల్లోపతీ ప్రకారం - న్యూట్రిషనల్ కీతోసిస్
ఆయుర్వేద ప్రకారం - స్నేహాపాన
వాటిలో ఉండే మంచిని కొంత, నాటు భాషతో ప్రజలతో చేరువ చేసి - దానికి VRK డైట్ అని పేరు పెట్టుకొని... బరువు & దానివల్ల వచ్చే దుష్ప్రయోజనాలు తగ్గిస్తా అంటే - మంచిది.
కానీ .... తెలిసీ తెలియక... స్నేహపాన ని శత్రుపాన లా మార్చి, అన్ని.... తగ్గిస్తా . .. కిడ్నీస్ సైజు పెంచుతా... అంటూ ఆరాచకం సృష్టిస్తున్న వీనిలాంటి చాలా మందితో సమాజం జాగ్రత్తగా ఉండాలి.

Address

UPIRI Hospitals , BENZ Circle , Nirmala Convent Road/Beside FlyOver
Vijayawada
520010

Alerts

Be the first to know and let us send you an email when Dr Sri Raghu Ram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Sri Raghu Ram:

Share